Own fridge, AC or car? No welfare schemes for you ఇంట్లో ఫ్రిడ్జి వుందా..? మీరు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదు..

Own fridge ac or car no welfare schemes for you

socio economic survey, refrigerator, washing machine, two wheeler, air conditioner, four room house, four wheeler, households population, car, Bibek Debroy Committee, AC, central government, social welfare schemes, benificiaries

Those having a four-room set or four-wheeler or an airconditioner will be automatically excluded from being eligible for social benefits in urban areas. Households owning all of three items -refrigerator, washing machine and a two-wheeler -will also be automatically excluded.

బైక్, ఫ్రిడ్జి వున్నాయా..? మీరు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదు..

Posted: 08/07/2017 09:27 AM IST
Own fridge ac or car no welfare schemes for you

నగరాలు, పట్టణాల్లో పేదరిక నిర్మూలణ కోసం అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎవరూ దుర్వినియోగం చేసుకోకుండా కట్టడి చేసే విధానంలో భాగంగా చర్యలను తీసుకుంది. దీంట్లో బాగంగా మీ ఇంటో బైక్ వున్నా.. ఫ్రిడ్జి వున్నా మీరు ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులు కారు. కేవలంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారు పాలిథిన్ కవర్ల గుడిసెల్లో వుంటున్న వారు మాత్రమే ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులుగా తేల్చేసింది.

తమ పథకాలను కేవలం అర్హులకు మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తాజాగా సాంఘిక అర్థిక సర్వే (సోష్యొ ఎకనామిక్ సర్వే)ను బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయగా, అ కమిటీ ఈ మేరకు కేంద్రానికి నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా ఇంట్లో ఫ్రిడ్జ్ వున్నా వారు కేంద్ర పథకాలకు అర్హులు కాదంటూ బాంబులాంటి విషయాన్ని నివేదికలో పొందుపర్చింది. కమిటీ సమర్పించిన నివేదిక అధారంగా కేంద్రం తమ పథకాలను అర్హులకు వర్తింపజేసేందుకు అడుగులు వేస్తుంది.

నగరాలు, పట్టణాల్లో నివాసముంటున్న వారికి కారు, ఫ్రిజ్, ఏసీ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులు కాదంటూ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పొందుపర్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎవరెవరికీ వర్తింపజేయాలన్న విషయాన్ని బిబేక్ దేబ్రాయ్ కమిటీ స్పష్టం చేసింది. ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది.

కమిటీ నివేదికలో కండిషన్స్ ఇవే
1. నాలుగు గదుల ఇల్లున్నా అనర్హులే
2. కారు నాలుగు చక్రాల వాహనం వున్నా అనర్హులే
3. ఇంట్లో ఎయిర్ కండీషనర్ వున్నా అనర్హులే
4. ఇక నాలుగో క్యాటగిరీలో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ద్విచక్రవాహనం వీటిలో ఏ ఒక్కటి వున్నా కేంద్ర సర్కారు సంక్షేమ పథకాలకు మీరు అర్హులు కాదని కమిటీ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles