Who's he? Asks Hema Malini on Spotting VP Candidate బాలీవుడ్ డ్రీమ్ గళ్ కు ఆయన ఎవరో తెలియక అడిగేసింది..!

Who s he asks hema malini on spotting vp candidate gopalkrishna gandhi

election, Gopalkrishna Gandhi, hema malini, parliament, rajya sabha, vice president, Vice-president election

Actress-turned-politician Hema Malini turned up to vote for the Vice President in Parliament on Saturday where she was hounded by photographers and cameramen. However, the spotlight quickly moved to a man who had just walked in.

బాలీవుడ్ డ్రీమ్ గళ్ కు ఆయన ఎవరో తెలియక అడిగేసింది..!

Posted: 08/07/2017 08:20 AM IST
Who s he asks hema malini on spotting vp candidate gopalkrishna gandhi

బాలీవుడ్ డ్రీమ్ గాళ్ గా రెండు దశాబ్ధాల పాటు యువత హృదయాలలో స్థానం సంపాదించిన నాటి సినీ నటి, ప్రస్తుత బీజేపి ఎంపీ హేమమాలిని.. సినీరంగంలో వుండగా అమెకు లభించిన సెలబ్రిటీ స్టేటస్.. అంతాఇంతా కాదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మరీ ముఖ్యంగా గత ఎన్నికలలో గెలిచిన తరువాత మాత్రం అమె పలు అంశాలలో విమర్శలను ఎదుర్కొన్నారు. పలు వివాదాల్లో చిక్కుకున్న అమె ఏకంగా నెట్ జనుల అగ్రహానికి కూడా గురయ్యారు.

అయితే తాజాగా అమె తనకు తెలియని విషయాన్ని అడగటంతో అమె మళ్లీ వార్తల్లో నిలిచారు. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని అమె గుర్తుపట్టలేకపోయారు. పార్లమెంటు అవరణలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎంపీలు అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే హేమామాలిని కూడా పార్లమెంటుకు వెళ్లారు. అమె అక్కడికి చేరుకోగానే మీడియా, ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టేశారు. ఆ తర్వాత, కొంచెం సేపటికి, గోపాలకృష్ణ గాంధీ అక్కడికి రావడంతో మీడియా మొత్తం ఆయన వద్దకు చేరారు.

తనకు లభించిన దానికన్నా అధికంగా గోపాలకృష్ణ గాంధీకి అదరణ లభించింది. అమె వద్ద నుంచి అందరూ గాంధీ వైపు పరుగులు తీసి అతన్ని కెమెరాలలో బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో అతనెవరో అంత ప్రాముఖ్యత ఇస్తున్నారనుకున్న హేమామాలిని.. తన మనస్సులో వున్న ప్రశ్నను ఏకంగా బయటపెట్టేసింది. ‘ఆయన ఎవరు?’ అంటూ అక్కడి మీడియాను హేమమాలిని ప్రశ్నించింది. దీంతో, షాక్ గురైన మీడియా ఫోటోగ్రాఫర్లు అయన గోపాలకృష్ణ గాంధీ అని చెప్పారు. అలాగాఅంటూనే, గోపాలకృష్ణ గాంధీ వద్దకు వెళ్లిన హేమమాలిని, తనను తాను పరిచయం చేసుకున్నారు. దీనికి ఆయన స్పందిస్తూ, ‘మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు హేమాజీ!’ అంటూ సరదగా వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles