Senior IT officials confront DK Shivakumar with documents ఆ నేలమాలిగల్లో అక్రమాస్తుల చిట్టా.. తవ్విన కొద్దీ..

Senior it officials confront dk shivakumar with documents

Ahmed Patel, BJP, Congress, Karnataka Minister, DK Shivakumar, Gujarat, Gujarat MLAs, I-T raids, Karnataka, Rajya Sabha

Income Tax officials are learnt to have started confronting the Energy Minister D.K. Shivakumar seeking explanation over his assets and investments in several businesses in India and abroad.

ఆ నేలమాలిగల్లో అక్రమాస్తుల చిట్టా.. తవ్విన కొద్దీ..

Posted: 08/05/2017 12:42 PM IST
Senior it officials confront dk shivakumar with documents

కాంగ్రెస్ పార్టీకి చెందిన గుజరాత్ ఎమ్మెల్యేలకు అతిధ్యమిచ్చినందునే.. కర్ణాటక ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ ను టార్గెటే  చేశారని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిగ్గదీసి అడుతున్న క్రమంలో ఇది ఖచ్చితంగా కక్షసాధింపు రాజకీయాలే అన్న వాదన తెరపైకి వచ్చినా.. గత నాలుగు రోజులుగా అక్కడ సాగుతున్న అదాయపన్ను అధికారుల తనిఖీల్లో తవ్విన కొద్ది అక్రమాస్తులు బయటపడుతున్నాయి. మంత్రి శివకుమార్ నివాసంతో పాటు అతని బంధు మిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల జరుపుతున్న సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

మరీముఖ్యంగా ఆయన ఆప్తులు, మిత్రులు, వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలోని అక్రమ ధనాన్ని, ఆస్తుల పత్రాలను దాచుకునేందుకు వీలుగా నేలమాలిగలను కూడా నిర్మించారంటే వీరి అక్రమార్జన ఎంతో కూడా సామాన్యులకు ఇట్టే అర్థమైపోతుంది. శివకుమార్ బంధుమిత్రుల ఇళ్లల్లో పదుల సంఖ్యలో లాకర్లు, నేలమాలిగల్లో వందల సంఖ్యల స్థిర, చరాస్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, నగదు బయటపడుతున్నాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు, మైసూరు, హాసన్ తదితర నగరాల్లో దాదాపు 64 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో ఆయన వ్యాపార పార్ట నర్, అనిల్‌కుమార్‌శర్మకు చెందిన ఇంట్లో 16 లాకర్లు,  ఒక నేల మళిగ ఉన్న గదిని అధికారులు గుర్తించారు. వాటి నుంచి వందల కోట్ల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక శివకుమార్ ఆప్తులైన వినయ్‌ కార్తీక్, ఎమ్మెల్సీ రవి, ద్వారకనాథ్, సచిన్ నారాయణ, బాలాజీ సుభేష్, తిమ్మయ్య తదితర ఇళ్ల నుంచి కిలోలకు కిలోలు బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్‌ విదేశాల్లో కూడా కొన్ని వ్యాపారాలు కలిగిఉన్నట్లు.. మనీల్యాండరింగ్ కు కూడా పాల్పడినట్లు ఐటీ అధికారులు అనుమానం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IT raids  Karnataka Minister  DK Shivakumar  congress  gujarat mlas  

Other Articles