సీబీఐ కాకుండా సిట్ కి అయేషా కేసు ఎందుకు? | Why AP Govt Prefer SIT More Than CBI for Ayesha Case

Sets up sit to re investigate ayesha meera case

Ayesha Case,Ayesha Meera Case, Ayesha Meera Murder Rape Case, Ayesha Murder Case, Ayesha Meera Murder Case, Ayesha Rape Murder Case, Damodar Goutam Sawang Damodar Goutam Sawang Ayesha Case, Ayesha Meera Case SIT Probe, SIT Probe Ayesha Meera Case, Ayesha Meera SIT CBI

Andhra Pradesh Sets up SIT to Re-Investigate Ayesha Meera Case. The home department has ordered the constitution of a special investigation team, headed by Deputy Inspector General rank officer Damodar Goutam Sawang. The SIT will include a woman officer and will be supervised by the commissioner of Vijayawada.

అయేషా కేసు సిట్ కే ఎందుకు?

Posted: 08/05/2017 12:43 PM IST
Sets up sit to re investigate ayesha meera case

సంచలనం సృష్టించిన విజయవాడ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యాచారం కేసును పునర్విచారణ సిట్ చేతిలో పెట్టింది ఏపీ ప్రభుత్వం. 8 ఏళ్లు శిక్ష అనుభవించిన సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ యేడాది ఏప్రిల్ 1న హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న సత్యం రోకలి బండతో గోడను ఎలా ఎక్కి దూకాడని చెప్పటం అద్భుతం అంటూ మొట్టికాయలు వేస్తూ అతన్ని రిలీజ్ చేయాలని చెబుతూ పునర్విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

తిరిగి ఆగష్టు 1న ఈ కేసులో కొందరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేసు పురోగతిపై ఆరా తీసింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం జీవో 132ను రిలీజ్ చేసింది. మరోపక్క కేసును సీబీఐకి అప్పగిస్తుందని భావిస్తే సిట్ కు అప్పగించి మరో వాదనకు తెరలేపింది ప్రభుత్వం. సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయ నిపుణులతో అధ్యయనం చేయించిన తర్వాతే ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చిందని చెప్పుకుంటున్నారు. అయేషా తల్లిదండ్రులు కనుక అంగీకరిస్తే కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ప్రభుత్వం చివరి నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) (ప్రత్యేక విచారణ బృందం) చేతిలో పెట్టి దుమ్ము దులుపుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కానీ, ఈ విషయం త్వరగతిన తేలాలన్నా, విచారణ వేగవంతం కావాలన్నా సిట్ మాత్రమే కరెక్ట్ అని ఓ మాజీ పోలీస్ ఉద్యోగి చెబుతున్నాడు. ఉన్నత విచారణ కమిటీ సీబీఐతో దర్యాప్తు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. కానీ, సిట్ కు మాత్రం నిర్దిష్ట కాలపరిమితి విధించే అవకాశం ఉంటుంది. తద్వారా కేసు త్వరగతిన పరిష్కారం అవ్వటమే కాదు, మున్ముందు ఆరోపణలు తలెత్తొద్దన్న కారణాలతోనే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించకపోయి ఉండొచ్చని ఆ ఉన్నతాధికారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. విచారణ బృందంలో మహిళా అధికారులు కూడా ఉండాలన్న ఆదేశంతోపాటు, రాష్ట్ర డీజీపీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించిన ప్రభుత్వం తాము అయేషా కేసు విషయంలో ‘చిత్తశుద్ధి’ తోనే ఉన్నామన్న సంకేతాలను పంపింది. ఏది ఏమైనా ఈ కేసులో ఇప్పటికైనా న్యాయం జరిగితే చాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayesha Meera Case  AP Govt  SIT Probe  

Other Articles