పట్టాలపై మహిళా హాకీ ప్లేయర్ బాడీ.. సూసైడ్? చంపేశారా?? Woman Hockey Player Dies in Suspicious Circumstances

Indian woman hockey player dead body found on railway track

Jyoti Gupt, Indian Hockey Player Death, International Hockey Player Death, Indian Woman Hockey Player Death, Hockey Jyoti Gupta, Jyoti Gupta Parents, Jyoti Gupta Suspicious Death, Jyoti Gupta Murder or Suicide, Sonepat Hocky Player Death, Hockey Player Death

International Hockey Player Jyoti Gupta Dead Body found at Railway Track. Dies in suspicious circumstances. Police says suicide but parents urged she was not timid.

మహిళా హకీ ప్లేయర్ ను చంపేశారా?

Posted: 08/04/2017 09:46 AM IST
Indian woman hockey player dead body found on railway track

అంతర్జాతీయ హ్యాకీ మ్యాచ్ లలో ఇండియా తరపున ఆడిన క్రీడాకారణి మరణం మిస్టరీగా మారింది. సోనేపట్ కు చెందిన జ్యోతి గుప్తా (20) మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించడం సంచలనం
సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహం హరియాణాలోని రేవారి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై కనిపించింది. ఆమెను ఎవరో చంపేసి ట్రాక్ మీద పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం.. చండీగఢ్-జైపూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో రేవారి స్టేషన్ సమీపంలోకి రాగానే పట్టాలపై ఓ మహిళ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. తాను బ్రేక్ వేసేందుకు ప్రయత్నించేలోపే రైలు ఆమెను ఢీకొందని రైలు డ్రైవర్ తెలిపాడంట. ఆ వెంటనే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందించాడని పోలీసులు చెబుతున్నారు.

అదే రోజు ఉదయం సోనేపట్ పారిశ్రామికవాడలో ఉన్న స్థానిక కోచింగ్ సెంటర్‌కు వెళ్లింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి పది, పన్నెండో తరగతి మార్కుల షీట్లలో కొన్ని కరెక్షన్లు ఉన్నాయని, కాబట్టి రోహ్‌తక్ వెళ్తున్నట్టు సమాచారం అందించింది. జ్యోతి చివరిసారి సాయంత్రం 7 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బస్సు ఆగిపోయిందని, ఇంటికి రావడం ఆలస్యమవుతుందని చెప్పింది. ఆ తర్వాత 10:30 గంటల సమయంలో కుటుంబ సభ్యులు జ్యోతికి ఫోన్ చేయగా దానిని రైల్వే పోలీసులు రిసీవ్ చేసుకుని జరిగిన ఘోరాన్ని వివరించారు.

2016 సౌత్ ఏషియన్ గేమ్స్, ఐదు దేశాల హాకీ టోర్నమెంట్ లో కూడా ఆడింది. చివరిసారిగా మే లో నిర్వహించిన ఆల్ ఇండియా యూనివర్సిటీ ట్రోఫీలో జ్యోతి పాల్గొంది. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తునారు. సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని, అసలు ఆ అవసరం తనకు లేదని వాళ్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Hockey Player  Jyoti Gupta  Death News  

Other Articles

Today on Telugu Wishesh