షాక్: మైత్రీ వనం వద్ద రోడ్డుపైనే డ్రగ్స్ అమ్మకం.. | Drug racket busted at Ameerpet 7 Arrested

Drug racket again busted in hyderabad

Hyderabad, Hyderabad Drug Arrestm Ameerpet Drug Arrest, Mytrivanam Drug Case, Drug Case, Siddipet Drug Case, Task Force Police Drug Case

Drug Racket again busted in Hyderabad. Local made Drugs sold at Ameerpet Mytrivanam Roads. Seven People Arrested by Task Force Police.

షాక్: అర్థరాత్రి మళ్లీ డ్రగ్స్ కలకలం

Posted: 08/04/2017 11:28 AM IST
Drug racket again busted in hyderabad

ఓవైపు మాదక ద్రవ్యాల ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నాడు. ఎక్సైజ్ శాఖ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ బృందం కూడా ఆ మూలాలు వ్యాప్తిచెందకుండా చూస్తామంటూ భరోసా ఇస్తున్నాయి. ఇంతలోనే మరోమారు డ్రగ్స్ కలకలం చెలరేగింది.

హైదరాబాద్ నడిబొడ్డున అర్థరాత్రి పలు కోచింగ్ సెంటర్ లకు కేంద్రం అయిన అమీర్ పేటలో డ్రగ్స్ అమ్మకం వెలుగుచూసింది. మైత్రీవనం వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురిని గురువారం రాత్రి
పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.5 కిలోల అల్ఫ్రాజోలం, అరకిలో డైజోఫామ్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని ప్రస్తుతం విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి, ఆపై కస్టడీకి తీసుకుంటామని తెలిపారు.

అయితే వారు ఎవరెవరికి మత్తు పదార్థాలు సరఫరా చేశారన్న విషయమై వారి సెల్ ఫోన్లను విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. రోడ్డుపై వీరి దందా కొనసాగుతోందన్న పక్కా సమాచారం తమకు అందంటతో ఈ దాడులు నిర్వహించామని తెలిపారు. నిందితులు సిద్దిపేట ప్రాంతానికి చెందిన వారని వెల్లడించిన పోలీసులు, బాన్స్ వాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ అందుకుని, నగరంలోని మరో వ్యక్తికి ఇచ్చేందుకు వచ్చారని వెల్లడించారు. మరోవైపు నిబంధనలను ఉల్లంఘిస్తున్న పబ్ ల విషయంలోనూ ఉక్కుపాదం మోపుతూ సీజ్ లు చేసుకుంటూ వెళ్తోంది టీ ఎక్సైజ్ శాఖ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Drug Case  Task Force Police  

Other Articles