వైట్ హౌజ్ గబ్బును తట్టుకోలేక ట్రంప్ అలా... | White House Staff Angry on Trump for Dump Comments

Trump call the white house a real dump

White House, White House Dump, White House Trump Comments, Trump Dump Comments, Donald Trump Real Dump, Trump White House, Trump White House Dump, White House Staff Trump, Real Dump Comments, Donald Trump White House, White House Garbage, Dirty White House

A golf journalist is standing by his report that President Trump called the White House a "dump" despite Trump's claim that it's "totally untrue.".

వైట్ హౌజ్ పరమ చెత్త బిల్డింగ్

Posted: 08/04/2017 09:11 AM IST
Trump call the white house a real dump

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ పై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తన జీవితంలో ఇంత చెత్త నివాసాన్ని ఎప్పుడూ చూడలేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడని ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం రాసింది. దీంతో ట్రంప్ డంప్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

గోల్ఫ్ మాగ్జైన్ అనే పత్రికలో.. ట్రంప్‌ తరచుగా న్యూజెర్సీలోని బెడ్‌ మినిస్టర్‌ లో గల తన గోల్ఫ్‌ క్లబ్‌ కు వెళ్తుంటారు. అందుకు గల కారణాన్ని తన సహచరులకు వివరిస్తూ, వైట్‌ హౌస్‌ ఓ డంప్‌ లాగా ఉంటుంది. అందుకే తరచూ ఇక్కడికి వస్తుంటానని ట్రంప్ అన్నారంటూ కథనం ప్రచురించింది. అలా సుమారు ఓ 9 మందితో ఆయన అలా చెప్పాడంటూ విమర్శలు వినిపించాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

కాగా, ఆ వ్యాఖ్యలపై ట్రంప్ వివరణ ఇస్తూ, వైట్‌ హౌస్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్నాడు. తాను చూసిన భవనాల్లో శ్వేతసౌధం చాలా అందమైనదని అన్నారు. కానీ నకిలీ మీడియా తాను దానిని డంప్ అన్నట్టు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన హోటళ్లకు మంచి రివ్యూ ఇచ్చిన గోల్ఫ్ మ్యాగ్జైన్ ఇప్పుడు వ్యతిరేకంగా రాయటం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం ట్రంప్ ట్వీట్లు వైరల్ అవుతుండగానే, అప్పటి ట్వీట్లను కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు.

ఇక ట్రంప్ కంపు కామెంట్ల న్యూస్ వైరల్ అవగానే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కుమార్తె చెల్సియా క్లింటన్‌ ట్విట్టర్ ద్వారా ‘వైట్‌ హౌస్‌ లో పనిచేస్తున్న ఉషర్స్‌, బట్లర్స్‌, పనిమనుషులు, వంటవాళ్లు, తోటమాలి, ప్లంబర్‌, ఇంజినీర్‌, క్యురేటర్‌ అందరికీ కృతజ్ఞతలు. ప్రతిరోజూ మీరు చేస్తున్న పనికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇది కూడా వైరల్ అయింది. ప్రస్తుతం అమెరికాలో ఈ వార్తే హైలెట్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  White House  Real Dump Comments  

Other Articles

Today on Telugu Wishesh