ఐఫోన్ కవర్ లో డేంజర్ రసాయనాలు.. పేలిపోతున్నాయిగా | Costly Phone Covers Contains Chemicals

Chemical burns with i phone covers

iPhone Covers, iPhone Covers Blast, iPhone Covers Chemicals, iPhone Covers Danger, iPhone Covers, Victoria's Secret Glitter, iPhone Glitter Covers, Phone Covers Chemical Burns

iPhone covers with harmful chemicals. Victoria's Secret glitter iPhone cases recalled after causing chemical burns. Company recalls 275,000 glitter iPhone cases after reports they break and leak.

అలర్ట్: ఐఫోన్ కవర్ తో మహాడేంజర్

Posted: 08/04/2017 08:50 AM IST
Chemical burns with i phone covers

మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే దానికి అద్భుతమైన రంగుల్లో ఆకట్టుకునేలా ఉన్న కవర్లను వేయించారా? కొంచెం జాగ్రత్తగా ఉండండి.ఐ ఫోన్ల కోసం తయారు చేయబడిన కవర్లతో ముప్పు పొంచి ఉందని కొన్ని ఘటనలు నిరూపిస్తున్నాయి. దాదాపు రెండు డజన్ల మంది శరీరంపై గాయాలు కావడంతో వినియోగదారులను సంస్థ అప్రమత్తం చేసింది.

కవర్ లోపల ఉండే లిక్విడ్ కారణంగా శరీరంపై గాయాలు అవుతున్నట్టు అమెరికన్ కన్జ్యుమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 24 మందికి గాయాలవగా, అందులో 19 మంది అమెరికాకు చెందిన వారే ఉండటం కొసమెరుపు. మిక్స్‌బిన్ అనే కంపెనీ తయారుచేస్తున్న ఈ ఐఫోన్ కవర్లను విక్టోరియా సీక్రెట్, హెన్నీ బెండెల్, నోర్డ్ స్ట్రోమ్ తదితర ప్రఖ్యాత బ్రాండ్ల పేర్లతో ఐఫోన్ కవర్లు విక్రయిస్తున్నారు. వీటిలో చాలా వరకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారానే అమ్ముడు పోతున్నాయి.

అక్టోబరు 2015-జూన్ 2017 మధ్య 2.63 లక్షల కవర్లు విక్రయించినట్టు అంచనా. ప్రస్తుతం ఈ కేసులు ఎక్కువ కావటంతో 2,75,000 కవర్లను వెనక్కి తెప్పించేసింది విక్టోరియా కంపెనీ. ఫోన్ వాడుతున్న సమయంలో లిక్విడ్ ఒక్కసారిగా పేలిపోతుండటంతో ముఖానికి, జేబులో పెట్టుకున్నప్పుడు మిగతా భాగాలకు కాలిన గాయాలు అవుతున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సదరు కంపెనీలకు యాపిల్ నోటీసులు పంపించింది. సో... ఎందుకైనా మంచిది. జాగ్రత్త...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iPhone  Covers  Chemical Burns  

Other Articles

Today on Telugu Wishesh