సామాన్యుల అపిల్ పండుగా పిలిచే టామాటాల ధరలు అందకుండా పైపైకి ఎగబాకుతున్నాయి. నిత్యవాసర సరుకుల ధరలను సామాన్యులకు అందుబాటులో వుంచే విధంగా చేస్తామని, వాటి ధరలపై ఎప్పటికప్పుడు పరిశీలించి..చెక్ పెడతామని ఎన్నికలకు ముందు చెప్పిన మాటలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయినట్లుంది. కేజీ టామాటా ధర ఏకంగా రూ.120 వరకు వెళ్లగా.. వాటిని అందుకునేందుకు సామాన్యులు మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు. పెరట్లో పెంచుకోదగిన ఈ టామాటాలకు ఇప్పడు వచ్చిన గిరాకీ వింటే.. నిర్థాంతపోకతప్పదు.
కొందరు పనిగట్టుకుని మార్కెట్లకు వెళ్లి టామాలోలను చౌర్యం చేస్తున్నారుని చెప్పినా అతిశయోక్తి కాదు. ఓ వైపు రైతులకు మాత్రం వారి సరుకుకు ధర రాక లబోదిబో మంటుంటే.. వినియోగదారులు మాత్రం ధరాఘాతంలో బెంబేలెత్తిపోతున్నారు. అయితే మధ్యనున్న దళారీలు మాత్రం లాభాలను అప్పన్నంగా మేసేస్తున్నారు. అయినా కేంద్రం మాత్రం ధరలను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పట్టనట్టు వ్యవహరిస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
దాంతో మండుతున్న టొమాటో ధరలకు నిరసనగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్ నవూలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ టొమాటో’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి నిరసనను వ్యక్తం చేశారు. సాధారణ బ్యాంకుల్లో లోనుగా నగదు ఇస్తే ఈ బ్యాంక్లో టొమాటోలను రుణాలుగా ఇస్తున్నారు. విషయం తెలిసి కస్టమర్లు బ్యాంకుకు బారులుతీరారు. ఇందులో తమ వద్ద ఉన్న టొమాటోలు డిపాజిట్ చేస్తే ఆరు నెలల తర్వాత రెట్టింపు మొత్తంలో టొమాటోలు వస్తాయని ఈ సందర్భంగా కస్టమర్లు మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. ‘నేను ప్రస్తుతం అర కేజీ టొమాటోలు డిపాజిట్ చేశారు. ఆరు నెలల తర్వాత కేజీ టొమాటోలు పొందుతాను’ అని 103 ఏళ్ల ఓ వృద్ధుడు చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more