Union Minister Ashok Gajapati Raju into tears ! కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కంట కన్నీరు..?!

Student moves union minister ashok gajapati raju to tears

Ashok Gajapati Raju moved to tears, Ashok Gajapati Raju moved to tears in dwarampudi, students fo dwarampudi turns as little teachers, ahsok gajapathi raju, union minister, dwarampudi, little teachers, tears, students, adopted village

Union Minister Ashok Gajapati Raju moves to tears as the students of his adopted village dwarampudi, says they are teaching their parents how to give finger prints and teaching alphabets

ITEMVIDEOS: కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కంట కన్నీరు..?!

Posted: 08/03/2017 12:32 PM IST
Student moves union minister ashok gajapati raju to tears

కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కంటతడి పెట్టారు..? అంటే ఆయనకేం బాధలు వున్నాయో..? అని నిట్టూర్చకండి.. అవి భాదతోనే, అవేదనతోనే, లేక ఇబ్బందులతోనే వచ్చిన కన్నీళ్లు కాదు. తన దత్తత గ్రామం ద్వారం పూడిలోని చిన్నారులు చెబుతున్న వాస్తవాలను విని.. ఆయన కంట ఆనందబాష్పాలు తన్నుకుని వచ్చేశాయి. ఇది ముమ్మాటికీ నిజం. తనకు తీరిక లభించిన వేంటనే తన నియోజకవర్గం పరిధిలోని దత్తత గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు.

ద్వారంపూడి గ్రామంలోని ఎంపీపీ స్కూలు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నరి విద్యార్థులు.. చిట్టి ఉపాధ్యాయులుగా మారిన వైనాన్ని తెలుసుకున్నారు. వారు మరెవరికి విద్యాబోధన చేస్తున్నారని అంటారా..? తమ తల్లిదండ్రులతో పాటు తత్సామానమైన పెద్దలకు అక్షరాభ్యాసం చేస్తున్నారు. వేలిముద్ర వేయడం కూడా రానీ తమ పెద్దలకు ముందుగా వేలిముద్రలు ఎలా వేయాలన్న విషయమై పాఠాలను చెప్పారు. దీంతో గ్రామంలో ఇక వేలిముద్ర వేయడం రానీ వారంటూ ఎవరూ లేరిన చిట్టి ఉపాధ్యాయులు చెప్పిన మాటతో కేంద్రమంత్రి కంట అనందంతో కన్నీరు తొలికింది.

విజయనగరం జిల్లాకు చెందిన తమ గ్రామం ద్వారంపూడి పేరును, చిట్టి గురువుల అంశాన్ని ప్రధాని నరేంద్రమోడీ కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారని ఓ విద్యార్థి చెప్పడంతో కేంద్రమంత్రి అనందబాష్పాలు రాల్చారు. అంతేకాదు గ్రామంలోని విద్యార్థులు ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు వయోజనులకు విద్యాభ్యాసం చేస్తామని కూడా విద్యార్థిని చెప్పడంతో ఆయన కంటతడి పెట్టారు. అనంతరం  గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారాయన. గ్రామంలో అన్ని సమస్యలను అంచెలవారీగా పరిష్కరిస్తానని చెప్పారు కేంద్రమంతి. అంతకుముందు గ్రామంలో ఆయన మొక్కలను నాటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ahsok gajapathi raju  union minister  dwarampudi  little teachers  tears  students  adopted village  

Other Articles