bride elopes with boyfriend, minutes after wedding బలవంతం పెళ్లి కాదన్న యువతిని తిట్టిపోసిన నెట్ జనులు

Kerala woman shamed online for walking out of forced marriage

Guruvayur, marriage, marriage, bride dumps groom, Guruvayur marriage, Kerala, bride, bride walks off with boyfriend, bridegroom, marriage, compensation, bride shamed, online, social media, viral news, Marriage Withdrawal, Marriage Shaming

recent incident proves that even a Guruvayur wedding can turn out to be possibly the shortest tie-up in the world. In this case, the bride decided to walk off with her boyfriend minutes after the wedding at the temple.

‘‘నీ భర్త నిన్ను చంపిన వార్తను త్వరలోనే వింటాం..’’

Posted: 08/03/2017 11:41 AM IST
Kerala woman shamed online for walking out of forced marriage

నీ భర్త నిన్న చంపాడన్న వార్తను త్వరలోనే వింటాము.. నీకు అసలు భవిష్యత్తు వుండదు.. నీ శవాన్ని ఏ నదిలోనో, బావిలోనో పోలీసులు గుర్తిస్తారు.. నీ బంగారు అభరణాలు అమ్మడైన తరువాత నీ భర్తకు నీ అవసరం వుండదు.. బంగారం మీద ప్రేమే తప్ప నీపైన కాదు.. కన్న తల్లిదండ్రులను బంధుమిత్రుల అందరి సమక్షంలో తలెత్తుకోనీయకుండా చేసి.. నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా..? చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుంది జాగ్రత్తా.. అంటూ ఓ యువతికి సోషల్ మీడియాలో పోస్టుల మీద సోస్టులు వచ్చాయి. ఇంతలా ఆ యువతిపై నెట్ జనులు ఎందుకని శాపనార్థాలు పెట్టారు. ఎందకంతగా విమర్శించారు.. యువతి కీడును ఎందుకు కోరుకున్నారు.? అసలేం జరిగింది..

తనకు ఇష్టం లేకున్నా.. తల్లిదండ్రులు చేసిన బలవంతపు పెళ్లిని కాదని ఎదురునిలిచినందుకు ఈ మేరకు యువతిని నెట్ జనులు అడిపోసుకున్నారు. అయితే ఇది ముందుగానే చేసివుంటే బాగుండేది. కానీ తల్లిదండ్రుల వద్ద తలపూని.. పెళ్లికి సరేనని, మరో యువకుడితో పెళ్లికి అంగీకరించిన.. తాళి కట్టించుకున్న కొద్దసేపటికే ఇంకా తలలోని తలంబ్రాలు కూడా తలపై నుంచి కిందకు జారిపోకముందే వరుడితో పాటు తన తల్లిదండ్రులకు షాక్ ఇస్తూ వధువు తన ప్రియుడితో కలసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో.. అమెను నెట్ జనులు తిట్టిపోస్తున్నారు. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో జరిగే వివాహాలు.. వధూవరులను నిండు నూరేళ్లు వర్థిల్లేలా చేస్తాయని ప్రతీతి. కానీ ఈ ఘటనతో అక్కడ జరిగే వివాహాలు నిమిషాల వ్యవధిలోనే పెటాకులవుతాయా..? అన్న సందేహాలకు కూడా అస్కారమిస్తుంది.

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిశూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. త్రిశూరులోని ముల్లస్సెరీకి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. గురువాయూర్ లోని శ్రీకృష్ణుడి ఆలయ కల్యాణ మండపం వివాహ వేదికైంది. వధూవరుల బంధువులతో అంతా సవ్యంగానే సాగిపోతోంది. సాధారణంగా పెళ్లిలో వుండే హడావిడి కూడా అక్కడ నెలకొంది. ఇక మూహూర్త సమయం అసన్నం కావడంతో వధూవరుల పెద్దల సమక్షంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కట్టి అమెను తన భార్యగా చేసుకున్నాడు.

ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే అసలు ట్టిస్ట్ ఏర్పడింది. పెళ్లైన వెంటనే.. తాళిబోట్టు మెడలో వేలాడుతున్నా.. వాటిని పక్కనబెట్టిన వధువు.. క్షణాల్లో అక్కడి నుంచి మాయమైంది. పాణిగ్రహణ, మంగళ సూత్రాధారణ జరగిన తరువాత తన మెడలో తాళి కట్టిన వాడే తన భర్త అని నమ్మి.. అతడితోనే ఇక తన జీవితం అని భావించే సంస్కృతి మనది. కానీ దానికి భిన్నంగా పెళ్లైన క్షణాల వ్యవధిలోనే అమె తన ప్రియుడితో కలసి వెళ్లిపోయింది. పెళ్లైన తరువాత కల్యాణ మండపంలో తన ప్రియుడు కనిపించడంతో అమె అతనితో కలసి మెల్లిగా జరుకుంది. దీంతో వధవు తల్లిదండ్రులతో పాటు వరుడు కూడా షాక్ అయ్యాడు.

దీంతో వదూవు, వరుడి కుటుంబసభ్యులకు మధ్య గొడవ ప్రారంభమైంది. అక్కడితో అగకుండా ఘర్షణాత్మక వాతావరణం కూడా ఏర్పడటంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఇక పంచాయితీ కాస్తా.. ఠాణాకు చేరింది. మీ అమ్మాయి వల్ల పరువు పోయిందని రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వరుడి బంధువులు డిమాండ్ చేశారు. దీంతో చివరికి రూ.8 లక్షలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించడంతో గొడవ సద్దుమణిగిందని పోలీసులు తెలిపారు. అయితే నిమిషాల వ్యవధిలో తన పెళ్లి పెటాకులు కావడంతో వరుడు మాత్రం హ్యాఫీగా ఫీలయ్యాడు. తన భాదను సంతోషంగా వ్యక్తపర్చేందుకు అదే వేదిక వద్ద బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరంగా జరుపుకున్నాడు. దీంతో నెట్ జనులు మాత్రం పెళ్లికూతురును అడిపోసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guruvayoor bride  bridegroom  marriage  compensation  bride shamed  online  social media  viral news  

Other Articles