Mob assaults Muslim man found with woman దాడి చేస్తూనే బట్టలూడదీసి నగ్నంగా తిప్పారు.!

Man stripped thrashed for being in love with woman of other religion

Jhakhand mob lynching, Bokaro man stripped thrashed, Jharkhand, Bokaro, mob attack, lynching, BJP govt, hindu mob lynched muslim man, Jharkhand news, Jharkhand latest news, Jharkhand lynching

A 25-year-old man was battling for life after he was assaulted by a mob which allegedly found him in a compromising position with a woman at a government-run centre in Jharkhand’s Bokaro town.

దాడి చేస్తూనే బట్టలూడదీసి నగ్నంగా తిప్పారు.!

Posted: 08/02/2017 03:06 PM IST
Man stripped thrashed for being in love with woman of other religion

పర మతానికి చెందిన మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నందుకు, అమెతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడంటూ ఓ వ్యక్తిపై దాడి చేస్తూనే బట్టలూడదీసి కొట్టారు. అంతటితో అగకుండా సదరు వ్యక్తిని నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. స్థానికులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తి సోమ్మసిల్లిడం.. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు యువకుడ్ని హుటాహుటిన అస్పత్రికి తరలించి చికిత్సను అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

జార్ఖండ్ లోని బొకారో జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా, అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ షకీర్ అనే వ్యక్తి బోకారో జిల్లాలోని ప్రగ్యా సెంటర్లో పనిచేస్తున్నాడు. సహోద్యోగినితో కార్యాలయంలో కొంత సన్నిహితంగా గడుపుతూ కనిపించడంతో స్థానికులు అతడ్ని కార్యాలయం నుంచి బయటకీడ్చుకొచ్చి.. దాడి చేశారు. అతన్ని గుడ్డలూడదీసి.. నగ్నంగా ప్రగ్యా మార్కెట్‌ చుట్టూ ఊరేగించారు.

స్థానికుల దాడిలో వ్యక్తి పోమ్మసిల్లిపోయినా అడనిపై దాడులు మాత్రం అక్కడి ముష్కరమూక అపలేదని సమాచారం. కొందరు స్థానికులు దాడిని చూసి తట్టుకోలేక పోలీసులకు సమాచారం అందిచారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడ్ని అస్పత్రికి తరలించి చికిత్సనందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి మూలకారణమని అనుమానిస్తున్న మంతు యాదవ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరికోందరి నిందితుల కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jharkhand  Bokaro  mob attack  lynching  BJP govt  

Other Articles