Woman MP slams Imran Khan, quits his party పీటిఐ అదినేతకు పార్టీ మహిళా నేత షాక్..!

Imran khan harasses women sends indecent text messages alleges woman mp

Pakistan Tehreek-i-Insaf, PTI, lawmaker, Ayesha Gulalai, ill-treatment, highly indecent, obscene text messages, Shireen Mazari, Nawaz Sharif, Imran Khan, Pakistan

A woman who quit cricketer-turned-politician Imran Khan's party accused him of harassing female party members and sending indecent text messages.

పీటిఐ అదినేత ఇమ్రాన్ కు పార్టీ మహిళా నేత షాక్..!

Posted: 08/02/2017 02:12 PM IST
Imran khan harasses women sends indecent text messages alleges woman mp

పాకిస్థాన్ లో అధికార ప్రభుత్వాన్ని ముప్పుతిప్పల పెట్టి ఎట్టకేలకు న్యాయపోరాటం ద్వారా మూడు చెరువుల నీళ్లు తాగించిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు గట్టి షాక్ తగిలింది. ఏకంగా అధ్యక్షుడు ఇమ్రాన్ పైనే తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఆ పార్టీ మహిళ పార్లమెంటు సభ్యురాలు పార్టీకి గుడ్ బై చెప్పింది. నవాజ్ షరీప్ ను గద్దెదింపానన్న అనందంలో వున్న ఇమ్రాన్.. రానున్న పాకిస్తాన్సార్వత్రిక ఎన్నికల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన పార్టీకి చెందిన ఎంఎన్‌ఏ ఆయేషా గులాలై ఇమ్రాన్ ఖాన్ ఆయనకు ఏమాత్రం వ్యక్తిత్వం లేదని అరోపణలు చేస్తూ రాజీనామా చేశారు.

మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అరోపించింది. తనతో పాటు పార్టీలోని ఇతర మహిళా నేతలకు ఇమ్రాన్ ఖాన్ అశ్లీల, అసభ్య సందేశాలు పంపేవారని ఆమె మండిపడ్డారు. ఇమ్రాన్ వల్ల తాను చాలా వత్తిడికి గురయ్యానని తెలిపిన అమె ఏకంగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పింది. పనామాగేట్ వ్యవహారంలో ప్రధాని నవాజ్ షరీష్ పదవికి దూరమైన నేపథ్యంలో ఆ పదవిని అందుకునేందుకు దేశవ్యాప్తంగా భారీ ర్యాలీని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఆయనపై మహిళా నేత అరోపణలు గుప్పించడం గమనార్హం.

సరిగ్గా, పాక్‌ నూతన ప్రధానిగా అబ్బాస్సీ ప్రమాణం చేసిన సమయంలోనే ఆమె ఈ విధంగా పీటీఐకు గుడ్ బై చెప్పారు. వ్యక్తిత్వం, గౌరవమర్యాదలే తనకు ముఖ్యమని, ఆ విషయంలో రాజీపడలేకే, రాజీనామాకు సిద్దపడినట్లు అమె స్పష్టం చేశారు. పీటీఐలో మహిళా శ్రేణులకు గౌరవం లేదని.. గౌరవప్రదమైన మహిళలెవరూ పార్టీలో పనిచేయలేరని ఆమె అన్నారు. అయితే, తాను ఈ విధమైన వేధింపులకు గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్నానని అమె చెప్పడంతో.. ఈ విషయమై అనుమానాలు కూడా వెల్లువెత్తాయి. కాగాపీటీఐ మహిళా నేత, చీఫ్ విప్ షిరీన్ మజారీ తోసిపుచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయేషాకు టికెట్ నిరాకరించడంతోనే ఆమె ఈ ఆరోపణలు చేశారని, పార్టీలోని మహిళలందరినీ ఇమ్రాన్ ఖాన్‌ సోదరుడిగా నిలబడతారని అమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan Tehreek-i-Insaf  Ayesha Gulalai  Imran Khan  text messages  PTI  pakistan  

Other Articles