ప్యాకేజీకే గతి లేదు.. ఇంక స్పెషల్ స్టేటసా? | Govt in sync with Centre People Hopes Special Status

Special status given by the centre to that state

Bihar, Bihar Special Status, Modi Nitish Bihar Status, Special Status Package, Modi Special Status Bihar, Special Status or Package, Bihar AP special status

Amid Alliance with NDA, Bihar sees govt in sync with Centre after 20 years, hopes of special status brighten. In past Prime Minister Modi announced special package of Rs 1.25 lakh crore for the state during the election campaign in 2015 but fell short of giving special status.

ప్రత్యేక హోదాపై చిగురిస్తున్న ఆశలు

Posted: 07/28/2017 09:23 AM IST
Special status given by the centre to that state

రెండే రెండు రోజుల్లో మొత్తం దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేశాయి బీహార్ పరిణామాలు. కూటమికి హ్యాండిచ్చి సీఎం నితీశ్ కుమార్ రాజీనామా, వెంటనే బీజేపీతో పొత్తు, ఆపై ఎమ్మెల్యేల మద్ధతుతో మళ్లీ ప్రమాణ స్వీకారం విదితమే. భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీలో గుబులు రేపగా, బీజేపీలో మాత్రం కొత్త ఆశలు చిగురింపజేసింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నట్టు అయింది.

ఇక ఇప్పుడు బీహార్ వాసులు తమ చిరకాల కోరిక నెరవేరుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే ప్రత్యేక హోదా సాధన.. బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం అసరమైతే ఏ కూటమికైనా మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని 2014 ఎన్నికల్లోనే నితీశ్ ప్రకటించాడు. అప్పటికే బీజేపీతో వైరం ఉన్నా.. ప్రత్యేక హోదా ఇస్తామంటే తిరిగి కలుస్తామని పేర్కొని నితీశ్ సంచలన ప్రకటనే చేశాడు. 2015లో బీహార్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ రూ.1.25 లక్షల కోట్లతో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అయితే అది వర్కవుట్ అవ్వలేదు. అయినప్పటికీ మోదీ వాగ్దానాన్ని గత రెండున్నరేళ్లుగా నితీశ్ గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి బీహార్ అభివృద్ధికి నిధులు చాలా అవసరమని ఆర్థిక మంత్రి జైట్లీని అడుగుతూ వస్తున్నాడు.

అయితే తాజాగా రాజకీయ సమీకరణలు మారి జేడీయూ ఇప్పుడు ఎన్డీఏ పక్షమైంది. 1998 తర్వాత రెండు చోట్ల బీహార్ లో ఒకే ప్రభుత్వం ఉంది. ఈ పరిణామం బీహార్ అభివృద్ధికి దోహదపడుతుందని, కేంద్రం నుంచి నిధుల రాకకు ఇక ఎటువంటి సమస్యలు ఉండవని ప్రజలు గంపెడు ఆశలతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా రాకున్నా ఆ మేరకు నిధులు సంపాదించుకోవడం నితీశ్‌కు పెద్ద కష్టం కాబోదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Special Status  Modi  Nitish Kumar  

Other Articles