పాక్ న్యూక్లియర్ దాడి.. భయం దేనికి? | Once Upon a time Pak prez Plan for Nuclear Attack on India

Musharraf mulled nuclear strike against india

Pervez Musharraf, Pervez Musharraf Nuclear Plan, Paliament Attack Nuclear Plan, Mainichi Shimbun India Pakistan, India Pakistan Nuclear Attack, India Nuclear Attack, Pak India War

Pakistan's former military dictator Gen Pervez Musharraf says he mulled the use of nuclear weapons against India amid tensions following the 2001 terror attack on the Indian Parliament, but decided against doing so out of fear of retaliation Japanese daily 'Mainichi Shimbun' mentioned.

భారత్ పై అణుదాడి.. అంత సీన్ ఉందా?

Posted: 07/28/2017 09:01 AM IST
Musharraf mulled nuclear strike against india

బలాబలాలు అంచనా వేయకుండా భారత్ పై అణుదాడికి సిద్ధమైతే పరిస్థితి ఎలా ఉంటుందో దాయాది దేశానికి బాగా తెలుసు. అందుకే చిన్న చిన్న కవ్వింపు చర్యలు మినహాయించి మరో దుస్సాహసానికి సిద్ధపడటం లేదు. ఒకవేళ పాల్పడినా అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం పాక్ కి ఉంది. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆసక్తికర పరిస్థితులను జపాన్ పత్రిక వెలుగులోకి తెచ్చింది.

అది 2001 తర్వాత భారత పార్లమెంటుపై పాక్ ముష్కరుల దాడి తర్వాతి పరిస్థితులు. ఇరు దేశాల మధ్య సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్‌పై వార్ కు సై అన్నంత కసిగా భారత్ ఉంది. దీంతో నాటి పాక్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. భారత్ నుంచి ఎదురయ్యే దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియని సైనిక నియంత ఎంతకైనా తెగించాలని నిర్ణయించుకున్నాడు. ఆఖరికి అణుదాడికి కూడా సిద్ధమయ్యాడని ‘మైనిచి శింబున్’ అనే పత్రిక కథనం లో పేర్కొంది.

అయితే అణ్వస్త్రాల ప్రయోగం విషయంలో గీసుకున్న గీతను చెరిపివేయాలా? వద్దా? అని ఆలోచిస్తూ ముషారఫ్ నిద్రలేని రాత్రులు గడిపినట్టు ఆయనను ఉటంకిస్తూ పేర్కొంది. అయితే అప్పట్లో భారత్, పాక్‌ల వద్ద అణువార్ ‌హెడ్లు లేవని, దీంతో అణు బాంబు ప్రయోగానికి వాటిని సిద్ధం చేసేందుకు ఒకటి రెండు రోజులైనా పట్టేదని ఆయన చెప్పినట్టు తన కథనంలో పేర్కొంది. కానీ, ఈ లోపు భగవంతుడి దయ వల్ల భారత్ కూడా ఆ పని చేయలేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తాము తొందరపడి ఉంటే మాత్రం భారత్ తరపున ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉండేదని, అందుకే వెనక్కి తగ్గానని ముషారఫ్ చెప్పినట్లు ఆ కథనం సారాంశం. 

బెనజీర్ భుట్టో కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముషార్రఫ్ ప్రస్తుతం దుబాయ్ లో శరణార్థిగా తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Nuclear Attack Plan  India  Pervez Musharraf  

Other Articles