చిక్కుల్లో తెలంగాణ రెబల్ ఎమ్మెల్యే | T Govt Issue Special GO to Prosecute MLA

Kcr shocking decision on rajasingh

MLA Raja Singh, MLA Raja Singh Telangana Government, Raja Singh Prosecution, BJP Rebel MLA Raja Singh, Raja Singh in Trouble, Raja Singh Controversial Comments, Special GO Raja Singh, BJP MLA Telangana Government,Telangana MLA Prosecuted

Telangana Legal Department Proceed to prosecute Goshamahal MLA Rajasingh. BJP MLA made controversy statements several occasions cases filed. On request of Commissioner of Police Mahender Reddy Govenment of Telangana issues GO Rt No 478 to prosecute BJP MLA Raja Singh.

ఎమ్మెల్యేపై యాక్షన్ కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Posted: 07/28/2017 11:13 AM IST
Kcr shocking decision on rajasingh

వివాదాస్పద వ్యాఖ్యాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ గతంలో ఓ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా, వాటిపై చర్యలు తీసుకోవాలని టీ న్యాయశాఖ నిర్ణయించుకుంది.

నాలుగేళ్ల క్రితం సెప్టెంబరు 29, 2013లో నగరంలోని షాయినాయత్ గంజ్‌లో జరిగిన విశాల గోరక్ష గర్జన సనాతన ధర్మ సభలో పాల్గొన్న రెబల్ రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్యే ప్రసంగంపై షాయినాత్ గంజ్ పోలీసులు సెక్షన్ 143 (ఎ) కింద కేసు నమోదు చేసి చార్జీషీటును కోర్టులో సమర్పించారు. అయితే ఆయనపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి న్యాయశాఖకు ఓ లేఖ రాశాడు.

దీనిపై స్పందించిన న్యాయశాఖ చర్యలకు అంగీకరిస్తూ ఓ జీవో పాస్ చేసింది. ఈ వ్యవహారంలో బీజేపీ ఢిల్లీ పెద్దలను సంప్రదించి వాళ్లు ఓకే చెప్పిన తర్వాతే ఓ నిర్ణయానికి వచ్చిన సీం కేసీఆర్ ముందుకు సాగమంటు న్యాయనిపుణులకు సూచించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య అయోధ్య రామమందిర అంశాన్ని ప్రస్తావిస్తూ... నిర్మాణాన్ని అడ్డుకుంటే తలలు నరుకుతానంటూ హెచ్చరించాడు. ప్రాణాలు ఇవ్వడానికే కాదు.. తీయడానికైనా సిద్ధమంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం రేగింది. వివాదాస్పద ప్రకటనలతో ఓ వర్గానికి తిరుగులేని నాయకుడిగా ఎదగాలని, ముంబయిలోని శివసేన పార్టీ నాయకులలాగా హైదరాబాద్ లో సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ కొందరు ముస్లిం నేతలు రాజాసింగ్ ను విమర్శిస్తుంటారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  BJP MLA Raja Singh  Telangana Government  Prosecution GO  

Other Articles