Pakistani council orders "revenge rape" of 16-year-old girl గ్రామపెద్దల దారుణ తీర్పు.. 16 ఏళ్ల బాలికపై ప్రతీకార అత్యాచారం

Pakistani council orders revenge rape of 16 year old girl

pakistan news, pakistan jirgas, pakistan womens rights, womens rights, revenge rape, punjab news, womens rights in pakistan, crime

In a horrific case, a village council in Pakistan's Multan ordered the rape of a teenager after her brother allegedly raped a minor.

గ్రామపెద్దల ‘ప్రతీకార అత్యాచార’ తీర్పు.. 16 ఏళ్ల బాలికపై దారుణం

Posted: 07/27/2017 02:57 PM IST
Pakistani council orders revenge rape of 16 year old girl

అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటే అత్యాచారం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షలు న్యాయస్థానాలు విధిస్తే.. ఇక వాటికి తిరుగుండదు. కఠిన శిక్షణలు వేసే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా అత్యాచారాలకు న్యాయస్థానాలే శిక్షలు విధిస్తాయి. కానీ ధాయాధి దేశం పాకిస్థాన్ లో మాత్రం చట్టాలు, న్యాయస్థానాలను కాదని కేవలం గ్రామ పంచాయితీలే శిక్షలను విధిస్తాయి. ఆ దారుణ శిక్షలు ఎలా వుంటాయన్న విషయం తెలిస్తే ఎవరైనా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

అత్యాచారాలకు అత్యాచారాలే తగిన శిక్షగా ఈ పిర్గాలుగా పిలవబడే ఈ పంచాయితీలు విధిస్తాయి. బాధితురాలికి న్యాయం చేయాల్సిన గ్రామ పంచాయితీలు.. నిందితుడి కుటుంబానికి చెందిన అడపడచులపైన అత్యాచారం చేయించేలా.. తీర్పును చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలికి న్యాయం జరగకపోగా, మరో అడపడచు కూడా గ్రామ పెద్దల సమక్షంలో.. గ్రామస్థులందరూ కళ్లప్పగించుకుని చూస్తుండగా అత్యాచారానికి గురువుతుంది. ఇది కౌరవుల సభలో ద్రౌపతి ఘటనలా నిలుస్తుంది. గ్రామపెద్దల తీర్పుపై నిరసనలు పెల్లుబిక్కినా.. దానిని ఎదురించలేక.. మిన్నకుండిపోతున్నారు.

తాజాగా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని ముల్తాన్ పట్టణానికి చేరువలో వున్న రాజ్ పూర్ అనే గ్రామంలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గడ్డి కోసేందుకు వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలికపై ఓ కామపిశాచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం గ్రామ పంచాయితీ పెద్దల దృష్టికి బాధిత కుటుంబసభ్యులు తీసుకురాగా, వారు దారుణమైన తీర్పిచ్చారు. 16 ఏళ్ల నిందితుడి సోదరిపై ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేయాలని తీర్మానం చేశారు.

ముహల్లే గ్రామానికి చెందిన యువకుడు రాజ్ పూర్ పంచాయితీని ఆశ్రయించి, తన సోదరిని సదరు గ్రామానికి చెందిన తమ బంధువులైన వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేశాడు. పంచాయితీ అధ్యక్షుడు విచారణ జరిపి, రేప్ చేసిన యువకుడి సోదరిని నలుగురి మధ్యకూ రప్పించి, ఆమెపై అత్యాచారం చేయాలని, దాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూడాలని తీర్పిచ్చాడు. ఈ తీర్పును వారు వ్యతిరేకించినా, ఇదే సరైన శిక్షని చెబుతూ, తమ తీర్పును దగ్గరుండి అమలు చేయించారు. ఈ ఘటన అక్కడి స్త్రీ సంక్షమ కమిటీ పోలీసుల దృష్టికి తీసుకురాగా, వారు కేసు నమోదు చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles