ఊరంతా చూస్తుండగా దగ్గరుండి గ్యాంగ్ రేప్ చేయించారు | Village Elders Ordered Revenge Rape

Village council in pakistan ordered the revenge rape

Pakistan, Pak Revenge Rape, Mukhtar Mai, Another Mukhtar Mai Incident, Mukhtar Mai Pakistan, Pakistan Village Council, Village Elders Gang Rape Orders, Jirga Revenge Rape, Tooth for Tooth Rape for Rape

Twenty people have been arrested in rural Pakistan after a village council ordered the rape of a teenage girl whose brother had been accused of raping another local girl.

రివెంజ్ రేప్: ఓ దిక్కుమాలిన తీర్పు!

Posted: 07/27/2017 02:38 PM IST
Village council in pakistan ordered the revenge rape

అత్యాచారం జరిగితే న్యాయం చేయండయ్యా అని వెళ్లినందుకు అక్కడి పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు ఎంత దారుణంగా ఉందో ఇక్కడ చూడండి. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని ముల్తాన్ అనే ప్రాంతంలోని దాష్టీకం చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో పంటికి పన్ను.. కంటికి కన్ను... తరహా తీర్పు ఇచ్చి సంచలనం రేపింది.

ముహల్లే అనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 12 ఏళ్ల తన కూతురిని దగ్గరి బంధువు అత్యాచారం చేశాడంటూ రాజ్ పూర్ జిర్గా(పంచాయితీ) ను ఆశ్రయించాడు. విచారణ జరిపిన పెద్దలు చివరకు నిందితుడి 16 సంవత్సరాల చెల్లిని అత్యాచారం చేయాల్సిందిగా ఆదేశించారు. పైగా పంచాయితీ సమక్షంలో, ఆమె కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడాలంటూ దిక్కుమాలిన తీర్పు ఇచ్చింది. తీర్పును పలువురు వ్యతిరేకించినా, ఇదే సరైన శిక్షని చెబుతూ, తమ తీర్పును దగ్గరుండి అమలు చేయించారు.

ఈ కేసులో ఫిర్యాదును అందుకున్న పోలీసులు పంచాయితీ అధ్యక్షుడు సహా 20 మంది పెద్దలను అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు. పాక్ లో ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. 2002 లో తన సోదరుడు ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా ముక్తర్ మై అనే ఓ మహిళను సాముహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన అనంతరం మనోనిబ్బరం కొల్పోని ఆవిడ ఇప్పుడు మహిళ హక్కుల కోసం పోరాడుతూ వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Revenge Rape  Village Council  

Other Articles