nandyal by-poll on august 23, counting on 28 నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

Nandyal by poll on august 23 counting on 28

nandyal by polls shedule, nandyal by polls notification, nandyal by polls date, nandyal by polls counting, nandyal, assembly, by-polls, by-elections, election comission, TDP, YSRCP, bhuma nagi reddy, election news

nandyal byelection shedule released by state election commission, which states by-polls takes place on august 23 and counting on august 28th

నంద్యాల ఉప ఎన్నికకు మోగిన నగారా

Posted: 07/27/2017 01:22 PM IST
Nandyal by poll on august 23 counting on 28

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు నగార మ్రోగింది. గత కొన్ని నెలలుగా ఖాళీగా వున్న ఈ స్థానంలో ఎన్నికల కమీషన్ ఉప ఎన్నికలకు నిర్వహించనుంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇవాళ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 29న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపిన ఎన్నికల సంఘం.. అదే రోజు నుంచి అగస్టు 5 వరకు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చని ప్రకటించింది.

అగస్టు 9 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును ఇచ్చింది. అగస్టు 23న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం.. అగస్టు 28న కౌంటింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించింది, వైసీపీ పార్టీ నుంచి గెలిచి.. టీడీపీ పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో అకస్మికంగా మరణించిన నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.

 ఈ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులను ఇప్పటికే ప్రథాన పార్టీలు ప్రకటించాయి. అధికార టీడీపీ పార్టీ నుంచి భూమ కుటుంబానికి చెందని బ్రహ్మానంద రెడ్డి బరిలోకి దిగుతుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే నంద్యాలలో పార్టీలు ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. కాగా షెడ్యూలు విడుదలతో ఇక ప్రచారం మరింత హోరెత్తనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandyal  assembly  by-polls  by-elections  election comission  TDP  YSRCP  bhuma nagi reddy  election news  

Other Articles