netherlands drug peddler mike cominga arrested డ్రగ్స్ కేసులో మరో కిలక నిందితుడు అరెస్ట్

Netherlands drug peddler mike cominga arrested in hyderabad

drugs mafia case, SIT, akun sabarwal, drugs case, tollywood, software professionals, mike cominga, drug mafia, visa, telangana, crime

another important arrest made in drugs mafia case in hyderabad, netherlands drug peddler and smuggler mike who had contacts with software professionals in india been arrested by telangana police.

డ్రగ్స్ కేసులో మరో కిలక నిందితుడు అరెస్ట్

Posted: 07/26/2017 04:27 PM IST
Netherlands drug peddler mike cominga arrested in hyderabad

తెలుగు సినీపరిశ్రమతో పాటు రాష్ట్రంలోని సంపన్న కుటుంబాలకు చెందిన సంతానానికి విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ అలవాట్ల చేయడంలో ఈ మాఫియాపై ఉక్కపాదం మోపుతున్న ఎక్సైజ్ అధికారులు అరెస్టు పర్వాన్ని కొనసాగిస్తున్నారు. విద్యార్థులు డ్రగ్స్ వాడకాన్ని నేర్పిస్తున్నారన్న క్రమంలో ప్రారంభమైన డ్రగ్స్ విక్రయదారుల అరెస్టులు.. వారికి టాలీవుడ్ పరిశ్రమలోని ప్రముఖలతో వున్న సంబంధాలు వెలుగు చూసిన నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చి.. విచారణ చేపడుతన్న విషయం తెలిసింది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సీనీ నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే రోని అరెస్టు తో తనకు సంబంధం ఏమీ లేదని, కేవలం వృత్తిపరంగా మాత్రమే తనకు తెలుసునని అమె చెప్పిన విషయం తెలిపిందే. కాగా తాజాగా అబ్కారీ శాఖ పోలీసులు ఈ కేసులో కిలక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. అయితే ఇతనికి ఎవరెవరితో సంబంధాలు వన్నాయన్న విషయమై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

నెద‌ర్లాండ్ దేశానికి చెందిన 35 ఏళ్ల మైక్ క‌మింగను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అకున్ తెలిపారు. పూర్తి ఆధారాలు సేక‌రించిన త‌ర్వాత ఆరు రోజుల పాటు ప్రయ‌త్నించి మైక్ కమింగను ప‌ట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి డ్రగ్స్ ను స్వాథీనం చేసుకున్నామని చెప్పారు. హైద‌రాబాద్‌తో పాటు దేశంలోని ఇత‌ర న‌గ‌రాల్లో కూడా మైక్ కమింగా డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన వీసాను పరిశీలిస్తే నాలుగు పర్యాయాలు కమింగ భారత్ కు రాగా, రెండు పర్యాయాలు హైదరాబాద్ కు వచ్చారని పోలీసులు తెలిపారు. అయితే అతనికి హైధరాబాద్ లో సాప్ట్ వేర్ ప్రోషెషనల్స్ తో సాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా లింకులు వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  మైక్ కమింగను విచారిస్తే కొత్త పేర్లు బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drugs case  tollywood  software professionals  mike cominga  drug mafia  visa  akun sabarwal  telangana  crime  

Other Articles