one arrested in mumbai building collapse ముంబైలో శివసేన నేత అరెస్టు..

Sivasena leader arrested after mumbai building collapse kills 17

shiv sena leader arrested, Sunil Shitap arrested, building collapse case arrest, residential building, Ghatkopar, eastern Mumbai, Lal Bahadur Shastri Marg tragedy, Brihanmumbai Municipal Corporation, former TV anchor, potholes, woman biker, National Highway, mumbai building collapse in ghatkopar, mumbai building collapse in ghatkopar, ghatkopar building collapse, mumbai building collapse, ghatkopar, brihanmumbai municipal corporation, bmc mumbai, bmc

Police arrested the owner of several apartments in a four-storey building that collapsed in Mumbai killing 17 people, an official said, adding the cause of the disaster was likely unauthorised renovation.

ముంబైలో శివసేన నేత అరెస్టు.. భవనం కూలడానికి కారకుడు..

Posted: 07/26/2017 05:14 PM IST
Sivasena leader arrested after mumbai building collapse kills 17

దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై తూర్పు ప్రాంతంలోని ఘాట్కోపర్ లో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. ఈ ఘటనకు అక్రమంగా చేపట్టిన మరమ్మత్తు పనులే కారణమని తేల్చిన అధికారులు.. అక్రమంగా మరమ్మతు పనులను చేపట్టిన శివసేన పార్టీకి చెందిన సునీల్ షిటాప్ ను అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా 17 మంది మృత్యువాతపడ్డారు. భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అట్టడుగు అంతస్తులో చేపట్టిన మరమ్మతుల కారణంగానే భవనం కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.

అట్టడుగు అంతస్తులో శివసేన పార్టీ నేత సునీల్‌ షిటాప్‌ నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఇందులో మరమ్మతులు చేపట్టాడు. ఈ కారణంగానే 35 ఏళ్ల కాలం నాటి భవనం కుప్పకూలిందని పోలీసులు తెలిపారు. ఈ భనవంలో సుమారు 12 కుటుంబాలు నివసిస్తున్నట్లు వారు చెప్పారు. ఇటీవల జరిగిన బ్రిహన్ ముంబై మున్సిఫల్ కార్పోరేషన్ ఎన్నికలలో సునీల్ షీటాప్ సతీమణి శివసేన పార్టీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. దీంతో తాను నాయకుడిని అన్న ధీమాతో అక్రమంగా చేపట్టిన మరమ్మతు పనులు వన నిర్మాణం కుప్పకూలడానికి కారణమైందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కాంగ్రెస్‌ మాజీ కార్పొరేటర్‌ ప్రవీణ్‌ చెద్దా మాట్లాడుతూ.. సునీల్‌ షిటాప్‌, అతని భార్య స్వాతి సునీల్‌ షిటాప్‌ భవనంలోని అట్టడుగు అంతస్తులో నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తుండే వారని తెలిపారు. అయితే గత రెండు, మూడు నెలలుగా దానిని మూసివేశారని, దీంతో ఖాళీగా వుంచడం ఇష్టంలేని సునీల్ షీటాప్ దానిని గెస్ట్ హౌస్ గా మార్చుకోవాలని భావించి మరమ్మతులు చేపట్టాడని, అయితే వరుసగా వర్షాలు పడుతున్న సమయంలో 36 ఏళ్ల నాటి భవనం మరమ్మతుల సమయంలో కుప్పకూలిందని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : building collapse  ghatkopar  shiv sena  Sunil Shitap  arrested  illegal renovation  crime  

Other Articles