వివాదంలో గాంధీ డాక్టర్లు.. ఏం చేశారో చూడండి | Gandhi Hospital Doctors in Another Controversy

Gandhi hospital doctors conduct homam

Gandhi Hospital, Gandhi Hospital Doctors, Gandhi Hospital Homam, Mrutyunjaya Homam Gandhi Doctors, Mrutyunjaya Homam Doctors, Doctors Mrutyunjaya Homam, Gandhi Hospital Controversy

Gandhi Hospital Doctors Conduct Mrutyunjaya Homam at Labour ward. Later People Criticise what they did to reduce New Born Deaths.

ITEMVIDEOS:వార్నీ... వాళ్లసలు డాక్టర్లేనా?

Posted: 07/25/2017 09:14 AM IST
Gandhi hospital doctors conduct homam

అక్షర జ్ఞాన౦తో అంతరిక్షానికి దూసుకెళ్తుంటే.. మూఢనమ్మకాలు మాత్రం మనల్ని ఇంకా కిందికి లాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నిర్లక్ష్య రాస్యత తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వాటికి వ్యతిరేకంగా వినూత్నరీతిలో అవగాహన కలిగించేలా కార్యక్రమాలను చేపడుతున్నారు హేతువాదులు. మౌలికమైన మార్పులు తీసుకొచ్చి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. అయితే అవి మంచిది కాదని సలహా చెప్పాల్సిన వైద్యులే వాటిని అనుసరిస్తే ఎలా ఉంటుంది.

సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి సిబ్బంది హోమం నిర్వహించటం వివాదాస్పదమవుతోంది. గైనకాలజీ వార్డులో ఈ మధ్య కాలంలో తల్లీపిల్లల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దీనికి వాస్తు దోషమే కారణమని, మృత్యుంజయ హోమం నిర్వహించడం ద్వారా ఆ దోషాన్ని సవరించవచ్చని ఒక వ్యక్తి సలహా ఇచ్చాడంట. దీంతో హడావుడిగా ఉన్నత వైద్యులు సిబ్బందిని అప్రమత్తం చేసి సుమారు 4 గంటల పాటు ఈ హోమం నిర్వహించారు.

 

కాగా, గాంధీ ఆసుపత్రి అవుట్‌ పేషంట్‌ విభాగానికి రోజూ సగటున 2,500 మంది రోగులు వస్తుంటారు. గైనకాలజీ విభాగంలో రోజూ సగటున 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. గాంధీ ఆసుపత్రికి వచ్చే కేసుల్లో అత్యధికం హైరిస్క్ కేసులే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. లేబర్ వార్డు దగ్గర నిర్వహించిన ఈ హోమంలో పలువురు వైద్య విద్యార్థులు కూడా పాల్గొనటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gandhi Hospital  Mrutyunjaya Homam  Controversy  

Other Articles