చెప్పినా జీతాలు పెంచట్లేదా? | Need Hike BSNL A day-long Nationwide Strike

Bsnl employees to go on nationwide strike

BSNL, BSNL Strike, BSNL Pays, BSNL Employees, BSNL Employee Union convenor P Abhimanyu, BSNL Pay Commission, BSNL Wage Hike,

Employees of state-owned telecom firm BSNL have called a day-long nationwide strike on July 27 for not being given wage hike by the third pay revision committee.

జీతాలు చాలట్లేదు.. ఇక పోరాటమే!

Posted: 07/25/2017 08:18 AM IST
Bsnl employees to go on nationwide strike

పోటీ నెట్ వర్క్ లు అన్ని ఆఫర్ల గాలంతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటే ప్రభుత్వ రంగ టెలికం అయి ఉండి బీఎస్ఎన్ఎల్ ఆ రేసులో చాలా వెనుకబడిపోయి ఉంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్లతో నెత్తిన మరో పిడుగు పడినట్లయ్యింది. తక్షణమే జీతాలు పెంచాలంటూ ఆందోళనకు సిద్ధమైపోతున్నారు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు. ఈ మేరకు సమ్మెకు కూడా రెడీ అయిపోతున్నారు.

మూడో వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నారు. అయితే ఉద్యోగుల మూలంగానే సంస్థ సంస్థ నష్టాల పాలైందన్న కంపెనీ ఆరోపణలు ఎంప్లాయీ యూనియన్ తోసిపుచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యతిరేక విధానాలే కారణమని యూనియన్ కన్వీనర్ పి.అభిమన్యు పేర్కొన్నాడు. జియో తో పోటీపడి మరీ ప్రతీ నెలా 20 లక్షల కొత్త కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారని, రానున్న రెండేళ్లలో కంపెనీ లాభాల బాట పట్టం ఖాయమని చెబుతున్నాడు.

మూడో వేతన సంఘం సిఫార్సులకు ఈ నెల 19నే కేబినెట్ ఆమోదించిందని, కానీ అమలు విషయంలో మాత్రం కావాలనే జాప్యం చేస్తున్నారని తెలిపాడు. వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఈనెల 27 దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెకు వెళ్తున్నట్టు ఆయన పేర్కొన్నాడు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించకపోతే సమ్మె మరింత ఉధృతమవుతుందని యూనియన్ హెచ్చరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSNL  Wage Hike  Nationwide Strike  

Other Articles