suchi leaks question makes dhanush walks out సుచీ లీక్స్ ప్రశ్నతో ధనుష్ మైండ్ బ్లాంక్.. వాకౌట్

Dhanush walks out of interview on questioning about suchi leaks

dhanush walks out of interview, suchi leaks question makes dhanush walks out, this is really stupid interview, dhanush, vip 2, suchi leaks, interview, kollywood, tollywood

kollywood hero dhanush walks out of interview on questioning about suchi leaks and disturbances in his family life

ITEMVIDEOS: సుచీ లీక్స్ ప్రశ్నతో ధనుష్ మైండ్ బ్లాంక్.. వాకౌట్

Posted: 07/24/2017 08:19 PM IST
Dhanush walks out of interview on questioning about suchi leaks

ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ కు కష్టాలు వెంటాడుతున్నాయా..? ఆ మధ్య సుచీ లీక్స్ ఎపిసోడ్ వెలుగుచూడటంతో.. ఆ తరువాత ధనుష్ తమ బిడ్డే అని చెప్పుకుని ఓ వృద్ద దంపతులు కేసు వేయడం.. అతడికి శరాఘాతంలా మారాయి. అయితే క్రమేపి అన్ని వివాదాల నుంచి బయటపడిన ధనుష్ ను ఇంకా వాటి తాలుకు నీడలు వెన్నాడుతున్నాయా..? అంటే అవుననే చెప్పాలి. తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 ధనుష్ తో ఇంటర్వ్యూ చేసింది. అయితే ఆ ఇంటర్వ్యూ నుంచి హీరో ధనుష్ అర్థంతరంగా వెళ్లిపోయారు. వెళ్తూ.. వెళ్తూ.. `దిస్ ఈజ్ రియ‌ల్లీ స్టుపిడ్‌ ఇంటర్వ్యూ` అంటూ వెళ్లారు.

అసలు హీరో ధనుష్ కు అంత కోసం ఎందుకోచ్చింది. అసలు జరిగిందేమిటీ..? ఇదంతా నిజమేనా..? లేక టీఆర్పీ రేటింగ్ కోసమా..? అన్న వివరాల్లోకి వెళ్తే..  టీవీ 9 కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ తో ఓ చిన్నపాటి ఇంటర్వ్యూ ను అహ్వానించింది. దీంతో సరేనన్న ఆయన అందుకు అంగీకరించి.. ఇంటర్వ్యూకు వెళ్లారు. హీరోను ప్రశ్నలు అడుగుతూ.. తాజాగా ఆయన ఎదుర్కోన్న సుచీ లీక్స్ అరోపణలపై టీవీ 9 ప్రతినిధి ఆయనను ప్రశ్నించింది.

వాటిపై ఆయన సమాధానం చెప్పకుండా దాఠవేత ధోరణి అవలంభించారు. ప్రతినిధి అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ వేసి.. అమెను కన్ఫూజన్ లోకి నెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయినా టీవీ 9 ప్రతినిధి ఆయనను అదే కోణంలో ప్రశ్నించారు. సూచీ లీక్స్ కారణంగా మీ వైవాహిక జీవితంలో కూడా మనస్పర్థలు వచ్చాయని టాక్ వచ్చింది. మీ వైవాహిక జీవితంలో బీటాలు వారాయా..? అని ప్రశ్నించారు. దీంతో కోప్రోద్రిక్తుడైన ధనుష్ `దిస్ ఈజ్ రియ‌ల్లీ స్టుపిడ్ ఇంటర్వ్యూ‌` అంటూ ధ‌నుష్ ఇంట‌ర్వ్యూ నుంచి వాకౌట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhanush  vip 2  suchi leaks  interview  kollywood  tollywood  

Other Articles