Saudi Police Arrest Woman For Wearing Skirt సౌదీలో స్కర్టు వేసుకుందని.. నేనేమి చేశాను నేరం..

Saudi police arrest woman for wearing skirt crop top in video

woman arrested in saudi, saudi woman arrested, woman arrested for wearing skirt, saudi arabia arrest, islamic rituals, model khulood, woman, skirt, saudi arabia, arrest, mecca, medina, islam laws, conservative dressing, driving, male escort

A Saudi woman has been arrested for a video that was widely shared online which showed her strolling along an empty street wearing a skirt and crop top, Saudi state TV channel Ekhbariya reported

ITEMVIDEOS: మినీ స్కర్టు వేసుకున్న పెద్ద సౌదీ పాప..

Posted: 07/19/2017 05:22 PM IST
Saudi police arrest woman for wearing skirt crop top in video

మతాచారాలకు పెద్దపీట వేసే అత్యంత పవిత్రమైన దేశమది. మరీ ముఖ్యంగా తమ దేశ మహిళలకు విధించిన నియమనిబంధనలను అతిక్రమించిన పక్షంలో వారికి దారుణ శిక్షలు విధిస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలటూ మహ్మదీయుల అత్యంత పవిత్రమైన మక్క మసీదు, మదీనాలు వున్న సౌదీలో మహిళలు అక్కడి కట్టుబాట్లను అతిక్రమించరు. కేవలం పాట పాడిందని, టీవీలో సినిమాలో, లేక మ్యూజిక్ ఛానెల్ లో పాటలో వింటుందనో, పాటలకు లయబద్దంగా పాదం కదుపుతుందనో భార్యలకు భర్తలు నిర్థాక్షిణ్యంగా విడాకులిచ్చే దేశమది.

అలాంటి దేశంలో ఓ యువతికి తాను స్కర్టు ధరించి తిరగాలన్న కొరిక కలిగింది. అలస్యం చేయకుండా అమె తనతో పాటుగా ఒక పురుష అస్కార్టును సహాయంగా తీసుకుని వెళ్లి నిర్జన ప్రాంతలో మినీ స్కర్టు ధరించి తిరగింది. తొలిసారిగా తాను మినీ స్కర్టు ధరించిన అనందంలో అక్కడికి చేరువలో వున్న ఏడారిలోకి వెళ్లి ఇసుకతో అడుకుంది. అయితే ఇది కొన్ని రోజుల క్రితం జరుగగా.. అమె అనుమతి లేకుండా అ వీడియోలను అమెతో వెళ్లిన పురుష అస్కార్టు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్తా దుమారాన్ని రేపింది.

ఆ యువతి వీడియోపై కొందరు స్థానికులు నిప్పులు చెరిగారు. దీనిని స్థానిక మీడియా ప్రచురించడంతో దానిపై స్పందించిన పోలీసులు ఏకంగా అమె ఎవరన్న విషయాన్ని గాలించి అమెను అరెస్టు చేశారు. ఇలా చేయడంతో అ యువతి వీడియో మరింతగా వైరల్ అయ్యింది. కేవలం స్కర్టు ధరించినందుకు యువతిని అరెస్టు చేశారన్న వార్త దావనంలా వ్యాపించి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వార్తగా మారింది. ఇక అ దేశచట్టం ప్రకారం అమెకు లాఠీ దెబ్బల దండన విధించే అవకాశాలే అధికంగా వున్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా తమ మతానికి చెందిన మహిళలు ఇలా వుంటే శిక్షలు విధిస్తున్న పలు ఇస్లామిక్ దేశాల చర్యలపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమంటున్నాయి. తమ మహిళలకు స్వేఛ్చను ఇవ్వకుండా.. పంజరంలోని చిలుకల మాదిరిగా వుంచుతున్నారని, కేవలం మగవారి అవసరాలను తీర్చే యంత్రాలుగా పరిగణిస్తున్నారని నెట్ జనులు మండిపడుతున్నారు. ఇక మరికోందరు మాత్రం.. ఇతర దేశాలకు చెందిన మహిళలను దుర్బుద్దితో చూసే ఇస్లామిక్ దేశాల పురుషులకు ఎందుకు శిక్షలు వేయరని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇతర దేశాల మహిళలపై లైంగికంగా వేధించే వారిని వదిలేసి కేవలం మహిళలపై మాత్రమే ఎందుకు దండన విధిస్తారని నిలదీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  skirt  saudi arabia  arrest  mecca  medina  islam laws  conservative dressing  driving  male escort  model khulood  

Other Articles