relief to jc diwakar reddy as indigo airlines lifts travel ban ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊరట.. ఎలాగబ్బా..?

Relief to mp jc diwakar reddy as indigo airlines lifts travel ban

JC Diwakar reddy, vishakapatnam, Indigo airlines, travel ban, vishaka airport, High Court, Diwakar travels, JC Diwakar Reddy, indigo airlines staff, TDP MP Airlines, JC Diwakar Reddy Ban, Airlines Ban MP, Airlines MP Ban List, Another MP Airlines Ban, TDP MP Vizag Airport, Vishakapatnam Airport TDP MP, Vishakapatnam Airport JC Diwakar Reddy, MP JC Ban Airlines, Vishakapatnam Airport JC Diwakar Reddy, Anantapur MP Ruckus, JC Diwakar Reddy Attack Airport Staff

Ananthapur member of parliament JC Diwakar Reddy, who was shocked by High Court questions day before, got a big relief as Indigo airlines lifts travel ban on him

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊరట.. ఎలాగబ్బా..?

Posted: 07/19/2017 04:21 PM IST
Relief to mp jc diwakar reddy as indigo airlines lifts travel ban

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ ధివాకర్ రెడ్డికి భారీ ఊరట లభించింది. రమారమి నెల రోజుల క్రితం ఆయనపై విధించిన ట్రావెల్ బ్యాన్ ను ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సంస్థ అధికారులు అధికారులు ఎత్తివేయడంతో.. ఆయనకు ఊరట లభించింది. గత నెల 15న విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో సంస్థకు చెందిన సభ్యుడితో వాగ్వాదానికి దిగగడంతో పాటు  ఆ సంస్థ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఆక్కడున్న సామాగ్రిని చిందరవందర చేశారన్న అభియోగాల నేపథ్యంలో ఇండిగో సహా 7 ప్రైవేటు విమానసంస్థలు అయనపై నిషేధాన్ని విధించాయి.

తనపై విధించిన ట్రావెల్ బ్యాన్ నేపథ్యంలో ఆయన న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. ఏకంగా  రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించి తనపై విధించిన ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసేలా అదేశాలను జారీ చేయాలని పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాక్ అయ్యారు. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సులో ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకుంటారా...? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరు కదా..? అని అడిగారు. అలాగే విమానసంస్థకు కూడా వాటి నిబంధనలు వుంటాయి. వాటిని అతిక్రమించడం తప్పే కదా అని అనడంతో జేసీ విస్మయానికి గురయ్యారు.

అయితే పిటీషన్ ను విచారణకు స్వీకరించిన నేపథ్యంలో అటు ఇండిగో విమానయాన సంస్థకు కూడా హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి వాయిదాలోగా కౌంటర్ ను దాఖలు చేయాలని విమాన సంస్థను అదేశించంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఇండిగో విమాన సంస్థ జేసీ దివాకర్ రెడ్డిపై విధించిన ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు ఊరట లభించింది. అయితే జేసీపై విధించిన ట్రావెల్ బ్యాన్ ను విమాన సంస్థ ఎత్తివేయడంపై పలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

కేంద్రంలోని అధికార బీజేపికి మిత్రపక్షంగా వున్న శివసేన ఎంపీ రవింద్ర గైక్వాడ్ పై ఎయిరిండియా ట్రావెల్ బ్యాన్ ను విధించిన క్రమంలో ఆయనను టార్గెట్ చేసిన విమనాయాన సంస్థలు ఆయన ఏ పేరుతోనూ టిక్కెట్ పొందకుండా అడ్డుకోవడంలో పైచేయి సాధించాయి. అయితే దీనిపై అగ్రహించిన శివసేన ఏకంగా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తిన క్రమంలోనూ ఆయనపై విధించిన నిషేధం విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర విమానాయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు.

ఈ క్రమంలో వాయిదా పడిన పార్లమెంటులో శివసేన సభ్యులు అశోక గజపతిరాజుతో వాగ్వాదానికి దిగడం.. కేంద్రమంత్రులు సుష్మీ, రాజ్ నాథ్ లు వారిని వారించి వెనక్కు పంపడం అంతా జరిగిపోయాయి. ఆ తరువాత ఆయన ఎయిర్ ఇండియా సిబ్బందికి పార్లమెంటు సాక్షిగా క్షమాపణ చెప్పిన పిమ్మట ఆ మరుసటి రోజున ఎయిర్ ఇండియా ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ జేసీ విషయంలో మాత్రం చడీచప్పుడు కాకుండా నిషేధాన్ని ఎత్తివేసిన క్రమంలో తన గూటికి చెందిన ఎంపీని ఎగరనిచ్చేందుకు కేంద్ర మంత్రి చర్యలు తీసుకున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles