శశికళకు వీఐపీ.. వాళ్లకేమో నరకం | Sasikala Effect 32 Prisoners Tortured and Shifted

Nhrc notice to karnataka dgp over prisoners row

National Human Rights Commission, Parappana Agrahara Central prison, Parappana Agrahara Central prison Prisons,Prisons Tortured Sasikala Issue, Karnataka Jail Officials NHRC, NHRC Notices, Prisoners Inhuman Treatment, Sasikala VIP Treatment, Sasikala Prison Bribe Issue

The National Human Rights Commission issues notices to top Karnataka Parappana Agrahara Central prison officials over alleged torture, transfer of 32 inmates. Allegedly, the prisoners were meted out this "inhuman" treatment because of their bid to stage a dharna inside the jail premises as they were not allowed to speak to (then) DIG D Roopa, who had visited the jail, it added.

చిన్నమ్మ ఇష్యూలో రాత్రికి రాత్రే...

Posted: 07/19/2017 12:37 PM IST
Nhrc notice to karnataka dgp over prisoners row

చిన్నమ్మకు వీఐపీ ట్రీట్ మెంట్ అంశంలో విమర్శలు ఎదుర్కుంటున్న జైళ్ల అధికారులకు మరో షాక్ తగిలింది. ప‌ర‌ప్ప‌న అగ్ర‌హారం జైళ్లో 32 మంది ఖైదీలను కొట్టి, రాత్రికి రాత్రి వేరే జైళ్ల‌కు త‌ర‌లించినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సంజాయిషీ ఇవ్వాల‌ని జైలు అధికారుల‌కు జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు పంపించింది.

జూలై 16న రాత్రికి రాత్రే వాళ్లను తీవ్రంగా కొట్టి మైసూర్, బళ్లారి, బెలగావి మరియు దేవనగరి జైళ్లకు పంపించినట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై బీజేపీ ఎంపీ శోభా కరందాల్జి ఫిర్యాదు చేసింది. ఖైదీల బంధువులను వెంటపెట్టుకుని మరీ ఆమె మానవ హక్కుల సంఘంను ఆశ్రయించింది. మాజీ జైళ్ల డీఐజీ డి. రూపతో మాట్లాడేందుకు జైలు ప‌రిస‌రాల్లో వారు ధ‌ర్నా నిర్వ‌హించార‌నే నెపంతో ఖైదీల‌ను శారీరకంగా హింసించి, త‌ర‌లించార‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని శోభా అంటోంది.

ఈ ఆరోప‌ణ‌ల‌పై నాలుగు రోజుల్లో స్పంద‌న ఇవ్వాల‌ని, ఖైదీల స్థాన‌చ‌లనానికి సంబంధించిన వివరాల‌తో పాటు, వారి ఆరోగ్య ప‌రిస్థితిని కూడా వివ‌రంగా తెలియ‌జేయాల‌ని క‌ర్ణాట‌క జైళ్ల శాఖ డీజీపీ, ఐజీల‌కు మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు జారీచేసింది. ప‌ర‌ప్ప‌న అగ్ర‌హ‌రం జైళ్లో అన్నాడీఎంకే నేత శ‌శిక‌ళ‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తూ ఇత‌ర ఖైదీల‌కు నాణ్య‌త లేని సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంపై మాజీ జైళ్ల డీజీపీ డి. రూప మీడియాకు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో వృత్తి నియ‌మాలు ఉల్లంఘించారంటూ ఆమెను, జైళ్ల శాఖ డీజీ హెచ్ ఎన్ సత్యనారాయణ రావును కర్ణాట‌క ప్ర‌భుత్వం బ‌దిలీ చేసి, ఆరోపణలపై విచారణకు సిద్ధమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NHRC  Inhuman Treatment  Parappana Central prison  

Other Articles