వెంకయ్య బీపీపై జోకులు.. బీజేపీకే నష్టం | Naidu becoming the VP is an irreparable loss for BJP

Venkaiah naidu damage to bjp

BJP Venkaiah Naidu, Venkaiah Naidu Political life, Venkaiah Naidu Cry, Venkaiah Naidu NDA Candidate, Venkaiah Naidu Vice President, Venkaiah Naidu Modi, Modi Venkaiah Naidu BP, Venkaiah Naidu Amit SHah, Amit Shah Venkaiah Naidu Exit, Venkaiah Naidu Life, Venkaiah Naidu VP BJP Lost, BJP Lost Venkaiah Naidu

Modi praises NDA's Vice President candidate Venkaiah Naidu. it will be for the first time that a person with a long experience of the Rajya Sabha would occupy that post. BJP President Amit Shah said "Naidu becoming the Vice President is an irreparable loss for the BJP". "But it also good that such a respected and qualified person is going to occupy that post," Shah said.

వెంకయ్య ఎగ్జిట్.. బీజేపీకే నష్టం!

Posted: 07/19/2017 12:03 PM IST
Venkaiah naidu damage to bjp

బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు నామినేషన్ తర్వాత ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి న్యూఢిల్లీకి రాజకీయ నావలో అత్యున్నత స్థానానికి చేరుతున్న నాయుడు తెలుగువారి ప్రతిష్టను మరింత పెంచాడనే చెప్పొచ్చు. గతంలో ఉపరాష్ట్రపతిగా పని చేసిన పెద్దల అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలను తనకు మార్గదర్శకాలని చెబుతూ.. మరో పక్క అన్నం పెట్టిన పార్టీని వీడుతున్నందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఎన్నికల కోసం ప్రచారం చేయనని చెబుతూనే తనకు ఏకపక్షంగా ఫుల్ సపోర్ట్ ఉందని, గెలుపు తనదేనని సూచనలు పంపించేశాడు.

ఇకపై రాజ్యసభలో సభాపతిగా వ్యవహరించబోయే వెంకయ్యనాయుడికి రక్తపోటు పెరగకుండా జాగ్రత్తగా చూసుకుంటానని తాను హామీ ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సరదా వ్యాఖ్యలు చేశాడు. నామినేషన్ కు ముందు ఎన్డీయే సమావేశం జరుగగా మోదీ వెంకయ్యపై ప్రశంసలు కురిపించాడు. తనదైన శైలిలో రాజకీయ నేతలపై విరుచుపడుతూ, విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించే వెంకయ్య వైఖరిని ప్రస్తావించాడు.

దేశమంతా తిరిగి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వెంకయ్య. అనేక ప్రాంతాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం. కేబినెట్‌ సమావేశాల్లో వ్యవసాయంపై వెంకయ్య చేసే సూచనలు విధాన రూపకల్పనకు ఉపయోగపడ్డాయి. ఉప రాష్ట్రపతి పదవికి కొత్త అయినా, ఆ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక రాజ్యసభలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ నేత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టటమూ ఇదే తొలిసారి కావొచ్చని పేర్కొన్నాడు. ఆయన ఉపరాష్ట్రపతి కావడం బీజేపీకి పూరించలేని నష్టమని, ప్రతిష్టాత్మక పదవికి ఇంత గొప్ప యోగ్యత గల నేత ఎంపికవడం హర్షణీయమని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  PM Narendra Modi  Amit Shah  

Other Articles