బీఫ్ లొల్లిలో బీజేపీ సీఎం | BJP CM No Shortage of Beef Comments Create Rucks

Vhp slams goa cm parrikar over beef remark

Manohar Parrikar, Parrikar Beef Comments, BJP CM Beef Comments, Beef Joy Party, VHP Demands CM Resignation, BJP CM Beef Controversy, Manohar Parrikar Beef Row, BJP Beef Party

Goa CM Manohar Parrikar said no beef shortage in Goa. If Necessary export from Karnataka. Later this statement create rucks. VHP Demands Parrikar Resignation and Is BJP 'Beef Joy Party' now? asked.

బీఫ్ వ్యాఖ్యలతో బుక్కైన బీజేపీ సీఎం

Posted: 07/19/2017 02:04 PM IST
Vhp slams goa cm parrikar over beef remark

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన గోమాంసం వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓవైపు బీఫ్ బ్యాన్ పై దృష్టిసారించామని చెబుతున్న బీజేపీ తరపునే ఇలాంటి వ్యాఖ్యలు రావటంతో అది మరింత ముదురుతోంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాజీనామాకు మిత్రపక్షం వీహెచ్ పీ డిమాండ్ చేస్తోంది.

గోవా రాష్ట్రంలో బీఫ్ కు ఎలాంటి లోటు లేదు. నిత్యం 2 వేల కేజీల మాంసం దొరుకుతుంది. ఒకవేళ కొరత ఏర్పడితే, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుందాం అంటూ పారికర్ మంగళవారం శాసభసభలో ఓ ప్రకటన చేశాడు. బెల్గామ్ తదితర ప్రాంతాల నుంచి గోమాంసం రవాణాను ప్రభుత్వం నిషేధించిందన్న విపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ.. ఇక్కడ బీఫ్ కొరత ఏర్పడదని తాను హామీ ఇస్తున్నానని, అదే జరిగితే ఇతర ప్రాంతాల నుంచి యధేచ్ఛగా రవాణా చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తుందని తెలిపాడు.

Parrikar Beef Comments

అయితే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే బీఫ్ ను వైద్యులు పరీక్షించి, నిర్ధారించిన తర్వాతే అనుమతించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. దీనిపై వీహెచ్ పీ తీవ్ర స్థాయిలో మండిపడింది. పారికర్ బీజేపీ పరువు తీసిపడేస్తున్నాడని, తక్షణమే రాజీనామా చేయాలని వీహెచ్ పీ ప్రతినిధి సురేంద్ర జైన్ డిమాండ్ చేశాడు. మరోవైపు కాంగ్రెస్ పారికర్ తప్పతాగి ఆ వ్యాఖ్యలు చేశాడేమోనంటూ విరుచుకుపడుతోంది. బీజేపీ అంటే బీఫ్ జాయ్ పార్టీగా మారిందని కామెంట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goa  CM Manhar Parrikar  Beef Comments  VHP  

Other Articles