నగ్న ఫోటోలతో ప్రియురాలిని బ్లాక్ మెయిల్.. ఆపై ఏం జరిగిందంటే... | Sexual Black Mail Nellore Youth Arrested

Youth uses nude pics to blackmail girl in nellore

Nellore, Nellore Girl Blackmail, Sexual Blackmail, Lover Naked Photos Blackmail, Boyfriend Blackmauil Girl, Lover Nude Blackmail, Girl Obscene Photos, Girl Obscene Blackmail

Youth held on the charge of blackmail in Nellore. He demands 6 Lakhs and collected 5 from that girl. Later on Girl Parents complaint Man arrested.

లవర్ నగ్న ఫోటోలతో లక్షలు గుంజాడు

Posted: 07/19/2017 11:09 AM IST
Youth uses nude pics to blackmail girl in nellore

ప్రేమ అనే గాలానికి చిక్కి, ఆపై చిక్కులు కూడా ఎదుర్కుంటోంది నేటి యువత. క్షణికావేశంతో ఆ టైంలో దగ్గరవ్వటం, అదే అదనుగా ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు కొందరు. నెల్లూరు లో ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ప్రేమికుడు డబ్బు కోసం ప్రేయసిని బ్లాక్‌మెయిల్‌ చేసి లక్షలు వసూలు చేశాడు. తల్లిదండ్రుల జోక్యంతో విషయం పై పోలీస్ స్టేషన్ కు చేరి వెలుగులోకి వచ్చింది.

మహాత్మాగాంధీ నగర్‌కు చెందిన ఓ యువతి (22) మూడేళ్ల క్రితం స్థానిక మసీదు వీధికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యంతో చనువుగా ఫోటోలు దిగారు. యువతి ఇటీవలె బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో అతగాడు బ్లాక్ మెయిల్ కు దిగాడు. తనకు రూ.6 లక్షలు కావాలని, లేకపోతే తన దగ్గర ఉన్న ఫోటోలు నెట్ లో పెడతానని బెదిరించాడు. అంతేకాదు వారం రోజుల్లో అడిగినంత ఇవ్వకుంటే రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ కూడా ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

భయపడి పోయిన యువతి ఇంట్లో బీరువాలో ఉన్న 5.72 లక్షలు దొంగతనం చేసి అతనికి అప్పగించి ఫోటోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను తీసుకుంది. డబ్బులు కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు యువతిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nellore  Blackmail  Obscene Photos  

Other Articles