Venkaiah Naidu files nomination for Vice President ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు నామినేషన్

Vice president election venkaiah naidu files nomination

Venkaiah Naidu, NDA candidate, Vice President, BJP, Congress, Vice Presidential poll, Gopalkrishna Gandhi, opposition parties candidate, venkaiah vice president, BJP parliamentary board's meet, amit shah, narendra modi, pm modi, Arun jaitley, sushma swaraj

M. Venkaiah Naidu, filed nomination papers to contest in Vice President election. His name was proposed by PM Modi, Finance Minister Arun Jaitley, and External Affairs Minister Sushma Swaraj.

ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు నామినేషన్

Posted: 07/18/2017 12:12 PM IST
Vice president election venkaiah naidu files nomination

నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపి అగ్రనేత ఎల్కే అద్వాని, మురళీ మనోహర్ జోషీలు వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారికి రోండు సెట్లు నామినేషన్ పత్రాలను సమర్పించారు. తొలి సెట్ పై ప్రధానమంత్రి మోడీ సంతకం చేయగా.. రెండో సెట్ పై రాజ్నాథ్ సింగ్ సంతకం చేశారు. బీజేపి, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సహా పలువురు ఎంపీలు, బీజేపి ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆగస్టు 5న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలో వెంకయ్యనాయుడు.. యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీలు పోటీపడనున్నారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఉపరాష్ట్రపతి పదవికి వన్నెతెచ్చిన వారితో పాటు నేను అందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన కొంత బావోద్వేగానికి గురయ్యారు.

పెద్దల సభ(రాజ్యసభ)కు గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను.. తల్లి లాంటి బీజేపి పార్టీ ఇంతవాన్ని చేసిందని.. ఇప్పుడు పార్టీని వీడటం బాధగా వుందన్నారు. ఇన్నాళ్లు రాజకీయాలలో నిమగ్నమైన తాను ఇకపై తన హోదాకు తగ్గట్లుగా హుందాగా వ్యవహరిస్తానని అన్నారు. ఇక ఉపరాష్ట్రపతి పదవిని తాను ఇష్టపూర్వకంగానే తీసుకున్నానన్న ఆయన.. ఈ రోజు నుంది తన పాత్ర మారుతుందని చెప్పారు. తనకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందే వెంకయ్యనాయుడు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన సారథ్యం వహిస్తున్న పట్టణాభివృద్ధి శాఖను నరేంద్ర సింగ్‌ తోమర్‌కు, సమాచార, ప్రసార శాఖ బాధ్యతలను స్మృతి ఇరానీకి అప్పగించారు. ఆనంతరం ఆయన నామినేషన్ ధాఖలు చేయడానికి సిద్దం అవుతూ బీజేపి అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  NDA candidate  Vice President  BJP  Congress  Vice Presidential poll  

Other Articles