youth brutally beaten to death దారుణం: నల్గోండలో కిడ్నాప్.. వనస్థలిపురంలో హత్యా..

Youth abducted in nalgonda and murdered in vanasthalipuram

young man, shoban, nalgonda youth, youth abducted in nalgonda, youth kidnapped in nalgonda, youth beaten to death in vanasthalipuram, vanasthalipuram, Telangana, old criminals, rajesh, TRSV leader, crime

A young guy of nalgonda abducted in from his native and bought to vanasthalipuram, where he was beaten to death by four.

దారుణం: నల్గొండలో కిడ్నాప్.. వనస్థలిపురంలో హత్య

Posted: 07/13/2017 03:33 PM IST
Youth abducted in nalgonda and murdered in vanasthalipuram

నల్గొండ, వరంగల్, సహా పలు జిల్లాలకు హైదరాబాద్ రాజధాని శివారు ప్రాంతాలు తమ అరచకాలకు అడ్డాలుగా మారాయి. గతంలో ఇలాంటివి ఎన్ని అరచకాలు జరిగాయో తెలియదు.. ఎందరో అభ్యాగుల మృతదేహాలను గుర్తుపట్టలేక మార్చురీలలోనే వుండిపోయాయి. తాజాగా అలాంటి ఘటనే మరోకటి వనస్థలిపురంలో చోటుచేసుకుంది. నల్లగొండకు చెందని శోభన్ అనే యువకుడ్ని కొందరు యువకులు కిడ్నాప్ చేసిన నగరశివారు ప్రాంతలంోని వనస్థలిపురానికి తీసుకువచ్చి.. అక్కడ రాడ్లతో దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక యువకుడు సొమ్మసిల్లిపోయాడు.

దీంతో కంగారుపడిన యువకులు బాధితుడ్ని దగ్గర్లోని అస్పత్రికి తరలించారు. అయితే అస్పత్రిలో చేరుకునే లోపే యువకుడు ప్రాణాలను కొల్పోయాడు. దీంతో అదే విషయాన్ని అస్పత్రి వర్గాలు యువకులకు తెలిపాయి. యువకుడ్ని నల్గోండ నుంచి కడ్నాప్ చేసి.. వనస్థలిపురం సహారా ఎస్టేట్‌ వద్దకు తీసుకొచ్చి దుండగులు హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి అస్పత్రిలో వున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఈ ఘటనలో నలుగురు యువకులు పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు అందులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ విభాగం నేతగా గుర్తించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పరారీలో వున్న నిందితుల్లో ఒకడిని రౌడీషీటర్‌ రాజేశ్‌గా గుర్తించారు. రాజేశ్‌పై గతంలో నాలుగు హత్యకేసులు ఉన్నాయి. శోభన్‌ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బుధవారం ఇంటినుంచి వెళ్లిన తమ కొడుకు గురువారం నాటికి హత్య గురికావడం కుటుంబసభ్యులను కలిచివేస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : old criminals  rajesh  TRSV leader  shoban  nalgonda youth  Telangana  

Other Articles