Top jail officials clash over "special" treatment to Sasikala శశికళకు రాజభోగాలపై విచారణకు అదేశించిన సీఎం

Karnataka cm orders inquiry into sasikala jail bribery case

VK Sasikala, AIADMK, Bengaluru jail, Karnataka, DG Prisons, Roopa Moudgil, Exclusive kitchen, Sasikala jail bribe, Sasikala Bengaluru jail kitchen, D Roopa, Sasikala, Big News, Bengaluru Jail, AIADMK, siddaramaiah, karnataka

Karnataka Chief Minister Siddaramaiah ordered an inquiry into AIADMK’s Sasikala bribed senior officials for special treatment in jail

శశికళకు రాజభోగాలపై విచారణకు అదేశించిన సీఎం

Posted: 07/13/2017 02:55 PM IST
Karnataka cm orders inquiry into sasikala jail bribery case

కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ రాజభోగాలను అనుభవిస్తున్నారన్న వార్తలు వెలుగు చూడటంతో పెనుకలకలం చేగుతోంది. జైలులో అమె శిక్ష అనుభవించేందుక వచ్చినట్లుగా లేదని, కొద్దికాలం విడిదికి వచ్చినట్లుగా వుందని జైళ్ల డీఐజీ రూపా ముద్గల్ అరోపించారు. ఈ మేరకు అమె కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణకు జైలులోని అక్రమాలపై లేఖ రాయడం అది కాస్తా అలస్యంగా వెలుగులోకి రావడంతో.. అటు తమిళనాడు, ఇటు కర్ఱాటక రాష్ట్రాలలో కలవరసరుస్తున్నాయి.

ఇక రూపా ముద్గల్ రాసీన లేఖలో అనేక అంశాలు పేర్కోన్నట్లు తెలుస్తుంది. శశికళకు నిబంధనలకు వ్యతిరేకంగా ఓ ప్రత్యేక వంటగది వసతిని ఏర్పాటు చేశారని అమె తాను రాసిన అరు పేజీల లేఖలో స్పష్టం చేశారు. ప్రత్యేక ఖైదీలుగా వున్నవారికి కూడా లేని సౌకర్యాలను శశికళకు కల్పించారని.. అయితే ఇలాంటి సౌకర్యాల కల్పనకు శశికళ వర్గం సభ్యుల నుంచి జైళ్లశాఖ ఉన్నతాధికారికి రూ.2 కోట్ల రూపాయల లంచం అందిందని అమె అరోపించారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

డీఐజీ రూపా ముద్గల్ లేవనెత్తిన అంశాలను కర్ణాటక జైళ్ల శాఖ ఏడీజీపి సత్యనారాయణ రావు తీవ్రంగా ఖండించారు. శశికళను ఓ సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నామని అమెకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం లేదని అన్నారు. రెండు కోట్ల రూపాయలు చేతులు మారాయని వినిపిస్తున్న అరోపణలను అకయన ఖండించారు. రూపా ముద్గల్ నివేదిక అవాస్తవమని అమె డ్యూటీలో చేరి కేవలం పక్షం రోజులే అవుతుందని అన్నారు. రూపా ఇలాంటి తప్పుడు నివేదిక ఎందుకు ఇచ్చారో తెలియదన్నారు. తాము న్యాయస్థానం అదేశఆల ప్రకరమే నడుచుకుంటున్నామని తెలిపారు.

కాగా, ప్రభుత్వానికి తాను పంపిన రిపోర్ట్ ను డీజీపీతో పాటు అడిషనల్ డీజీపీ సత్యనారాయణ ఖండించడంపై రూపా ముద్గల్ మాట్లాడుతూ, జైలులో తాను ఏం చూశానో వాటినే రిపోర్టు రూపంలో పంపించానని స్పష్టం చేశారు. డీజీపీ ఎందుకలా చెప్పారో తనకు తెలియదని చెప్పారు. పరప్పన జైలులో శశికళతో పాటు మరికొందరికి కూడా ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నాయని ఆమె తెలిపారు. శశికళకు ప్రత్యేక సౌకర్యాల విషయంలో 2 కోట్ల రూపాయలు చేతులు మారాయని జైలు ఖైదీలే మాట్లాడుకుంటారని చెప్పారు. తన పని నివేదిక ఇవ్వడం వరకేనని, ఉన్నతాధికారులకు ఆ నివేదికను అందజేశానని ఆమె అన్నారు. అయితే దానిలోని అంశాలపై చర్యలు తీసుకోవడం, తీసుకోకపోవడం అధికారుల చేతుల్లోనే ఉందని ఆమె చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో నిజానిజాలను నిర్ధారించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విచారణకు అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : D Roopa  Sasikala  Big News  Bengaluru Jail  AIADMK  siddaramaiah  karnataka  

Other Articles