kaloji university gives clarity on telangana localite issue తెలంగాణలో ఇక వీళ్లూ ‘లోకలే’.. క్లారిటీ వచ్చేసింది..!

Kaloji university gives clarity on telangana localite issue

local residents of telangana, Kaloji Medical university local issue clarity, kaloji university clarfies local issue, telangana localites issue, telangana locals, Kaloji Rao Medical university, Local issue, localites, telangana, andhra pradesh

kaloji narayana rao univeristy of health sciences gives clarity on telangana locals issue in medical entrance councilling.

తెలంగాణలో ఇక వీళ్లూ ‘లోకలే’.. క్లారిటీ వచ్చేసింది..!

Posted: 07/13/2017 02:12 PM IST
Kaloji university gives clarity on telangana localite issue

రాష్ట్ర పునర్విభజన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తాయి. అయితే అన్నింటి కన్నా ముఖ్యంగా ప్రజలు మధ్య కూడా విద్వేషాలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యోగాలు, ఉపాధి అంశం కూడా అధిక ప్రభావం చూసిన నేపథ్యంలో ఇరు ప్రాంతాల ప్రజల మద్య వైషమ్యాలు రాజుకున్నాయి. ఇక రాష్ట్ర విభజన అంశాన్ని ఎలాగోలా జీర్ణించుకోక తప్పని పరిస్థితులలో దు:ఖాన్ని దిగమింగుకున్న ఒక ప్రాంత ప్రజలు.. తమ భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్ పై అందోళనలో పడ్డారు.

కాగా, తెలంగాణలో విద్యాసంస్థల్లో సీట్ల భర్తీపై పదేళ్ల పాటు అంటే 2024 వరకు ఉమ్మడి ప్రవేశాలు నిబంధన అప్పటి యూపీఏ ప్రభుత్వం కల్పించడంతో వారికి కొంత ఊరటనిచ్చింది. కాగా అందోళన చెందుతున్న వారి భాదను తెలంగాణ ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని వారిని అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నించింది. అదెలా అంటారా..?. తెలంగాణ రాష్ట్రంలో స్థానికతపై తాజాగా క్లారిటీని ఇస్తూ.. ఈ మేరకు అందోళన చెందాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పంపింది.

ఎంబీబీఎస్.. బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో ఈ విషయాన్ని కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ అప్ హెల్త్ సైన్సెస్ స్పష్టంగా పేర్కొనింది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు.. స్థానికత.. కులం వివరాలతో పాటు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాల్ని తీసుకురావాలని ఇప్పటికే అదేశఆలను జారీ చేసిన యూనివర్శిటీ అధికారులు ఇక లోకల్ అంశంపై కూడా క్లారీటీని ఇచ్చేశారు.

ఈ కోర్సులు ప్రవేశాలలో చేరునున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకూ తెలంగాణలో చదవిన విద్యార్థులందరూ లోకల్ లే అన్న కార్లీటీని ఇస్తూ.. ఇందుకు సంబంధించిన స్టీడీ సర్టిఫికేట్లను జత చేయాలని అదేశించారు. అదే సమయంలో అభ్యర్థి కానీ.. అభ్యర్థి తల్లిదండ్రులు కానీ పదేళ్లగా తెలంగాణలోనే నివసించినట్లుగా తహసీల్దారు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అదేశించారు. దీంతో తెలంగాణలో గత పదేళ్ల క్రితం వచ్చిన వారందరూ ఇక లోకల్ గా పరిగణింపబడతారు. దీంతో నాన్ స్టాప్ గా పదేళ్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారు.. తెలంగాణ ప్రాంత స్థానికులుగా గుర్తింపు పొందే వీలుందన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి వచ్చినట్లైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaloji Rao Medical university  Local issue  localites  telangana  andhra pradesh  

Other Articles