If Pak Request China Would Enter Into Kashmir

Indian army pitches tent in doklam

India China, Indian Army Tents, Indian Army Doklam Issue, Doklam Pakistan, India China Pakistan, India Kashmir China, China Intervention Kashmir Issue, Pak Request China Enters Kashmir, China Warn India, Indian Army Tents China, Indian Army Long Haul

Indian Army not to retreat; set for long haul in Doklam according to Sikkim Row. Chinese Media Publish news i.e. Third Country's Army Could Enter Kashmir At Pak's Request.

ఇండియా టెంట్లు... చైనాకు ఛాన్సు దొరికిందా?

Posted: 07/10/2017 09:21 AM IST
Indian army pitches tent in doklam

సరిహద్దులో టెన్షన్ ను మరింత పెంచేస్తూ భారత సైన్యం గుడారాలను నిర్మించేసింది. డ్రాగన్ కంట్రీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మరీ ఈ నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉద్రిక్తతలు నెలకొన్న డోక్లాం నుంచి సైన్యాన్ని భేషరుతుగా వెనక్కి పిలిపించుకోవాలన్న చైనా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గట్లేదు. తాజా నిర్ణయంతో ఇంకా చాలా రోజులు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటామంటూ చెప్పకనే చెప్పేసింది.

శరవేగంగా గుడారాలు నిర్మించటమే కాదు.. అవసరమైతే సుదీర్ఘ స్టాండాఫ్‌కు సిద్ధమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భూటాన్ త్రికూడలిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే ఎటువంటి షరతులు లేకుండా ఇండియన్ ఆర్మీ వెనక్కి వెళ్లాలని చైనా పలుమార్లు కోరింది. బంతి భారత్ కోర్టులోనే ఉందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించింది. అయితే ఆ బెదిరింపులకు తాము లొంగే రకం కాదని ఇండియన్ ఆర్మీ తాజా చర్యతో నిరూపించినట్లయ్యింది.

గుడారాలు వేసుకుంటున్న సైనికులకు ఆహార పదార్థాలు పూర్తి స్థాయిలో సరఫరా అవుతున్నట్టు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సమస్యను దౌత్య పరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చంటూనే, చైనాకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన వ్యాఖ్యానించటం విశేషం. కాగా, ఇరు దేశాలు 2012లో సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ఓ అంగీకారానికి వచ్చాయి. వివిధ స్థాయిల్లో చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని ఒప్పందానికొచ్చాయి. అయితే చాలా ఏళ్లుగా ఈ ఒప్పందానికి విలువ లేకుండా పోయింది.

కశ్మీర్ లో కాలుపెడతాం...

డోక్లాం విషయంలో చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా భారత్ పట్టించుకోవడం లేదు. దీంతో బెదిరింపులకు దిగిన చైనా మీడియా కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు చైనాలో ప్రభుత్వ విధానాలకు నిర్దేశం చేస్తుందనే పేరున్న గ్లోబల్‌ టైమ్స్‌ పతిక్రలో సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ లాంగ్‌ జింగ్‌ చున్‌ అనే కాలమిస్టు సరికొత్త వాదనతో కాలమ్ రాశాడు. అందులో ‘‘సిక్కిం సెక్టార్‌ లోని డోక్లాం ప్రాంతంలో చైనా మిలటరీ రోడ్డు నిర్మించకుండా భూటాన్‌ తరపున భారత్‌ వచ్చి అడ్డుకుంది. భారత్‌ చెబుతున్న దాని ప్రకారం భూటాన్ కోరింది కనుక చైనాను భారత్ అడ్డుకుంటోంది. అంటే పాకిస్థాన్‌ అభ్యర్థిస్తే ‘మూడో దేశం కశ్మీర్‌లో ప్రవేశించవచ్చు’’ అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  India  Doklam Issue  kashmir  

Other Articles