Pawan Happy with Jagan's Padayatra

Pawan kalyan respond on jagan padayatra

Pawan Kalyan, Pawan Kalyan YS Jagan, Pawan Kalyan Jagan Padayatra, Pawan Happy with Jagan Padayatra, Jagan Padayatra Pawan Respond, Pawan Janasena Internal Meet, Pawan Satires Jagan Padayatra, Pawan Satire Jagan, Pawan About YS Jagan Padayatra, Jagan Padayatra, Pawan Janasena Meet

Janasena Chief Pawan Kalyan respond on Jagan Padayatra. If really people's problems get highlighted and get solved with those (Jagan's) Padayatra, well, it's good for everyone. I'll be most happy if people's problems are solved. The credit need not come to me. I don't mind even if the credit goes to them (YSRCP),"

ITEMVIDEOS:జగన్ పాదయాత్ర... పవన్ ఫుల్ హ్యాపీ

Posted: 07/10/2017 10:49 AM IST
Pawan kalyan respond on jagan padayatra

ఉరిమిన ఉత్సాహం అంటూ ప్లీనరీతో వైసీపీలో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. 2019 లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగన్ అండ్ కో పాదయాత్ర అనే పవర్ ఫుల్ అస్త్రంతో ప్రజలకు చేరువయ్యేందుకు యత్నాలు మొదలుపెట్టబోతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అక్టోబర్ 27 నుంచి ఏపీలో వైసీపీ చీఫ్ పాద్రయాత్ర మొదలుకాబోతుంది. ఈ నేపథ్యంలో తమ అధినేత గురించి, పాలన గురించి, మరీ ముఖ్యంగా జగన్ పాదయాత్రపైనే టీడీపీ నుంచి కౌంటర్ లు పడుతాయని అంతా ఆశించారు. కానీ, ఊహించని వ్యక్తి నుంచే మొదట స్పందన రావటం ఇక్కడ విశేషం.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే పార్టీ విస్తరణ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలను జరుపుతున్నాడు కూడా. జగన్ పాదయాత్ర ప్రకటన తర్వాత జరిగిన భేటీలోఈ ప్రస్తావన రాగా, పవన్ దీనిపై స్పందించాడు. నిజానికి ఈ యేడాదిలో తాను అనంతపురంలో పాదయాత్ర చేద్దామని భావించానని, కానీ, ఇప్పుడు వాళ్లు కూడా పాదయాత్ర అంటూ ముందుకొచ్చారని, ఆ ప్రకటనతో తనకేం సంబంధం లేదని చమత్కరించాడు.

 

పాదయాత్ర ఎవరూ చేసినా ఫర్వాలేదన్న ఆయన, ముందు ప్రకటన చేసి ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలిచామన్న విషయం సంతోషాన్ని కలిగిస్తుందన్నాడు. వాళ్ల యాత్రతో ప్రజాసమస్యలు పరిష్కారం అయితే ఇంకా సంతోషిస్తానని పేర్కొన్నాడు. ఈ పోరాటంలో విజయం సాధించి, ఆ పేరు మొత్తం వాళ్లకే వెళ్లినా తానేం బాధపడనని చెప్పుకొచ్చాడు. ఇక అధికారాన్ని ఎదురించే దమ్మున్న యువత మాత్రమే జనసేన పార్టీలోకి రావాలంటూ పిలుపునిచ్చిన పవన్, త్వరలో అన్ని జిల్లాల కార్యకర్తలతో విడివిడిగా భేటీలు జరపనున్నట్లు ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena Party  YSRCP  Jagan Padayatra  

Other Articles