MLAs Assault Woman in Assembly Premises

Aap mlas booked in another controversy

Aam Aadmi Party, AAP MLAs, MLAs Assault Woman, Woman Assaulted Assembly, AAP MLAs Rape Attempt, Woman Rape Attempt Assembly, MLA Rape Attempt, AAP Party Worker Rape Attempt, AAP MLAs Controversy

Aam Aadmi Party (AAP) MLAs for allegedly manhandling and abusing a woman in the assembly premises recently, Delhi Police has registered a case . In her complaint, the woman has accused Okhla AAP MLA Amanatullah Khan, Malviya Nagar MLA Somnath Bharti and Tilak Nagar MLA Jarnail Singh of abusing and thrashing her on June 28, the police said.

అసెంబ్లీ బయట ఎమ్మెల్యేల దౌర్జన్యం

Posted: 07/08/2017 09:02 AM IST
Aap mlas booked in another controversy

ఆప్ ఎమ్మెల్యేలు వివాదాస్పద వైఖరితో వార్తల్లో నిలుస్తున్నారు. ఏకంగా అసెంబ్లీ పరిసరాల్లోనే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో వారిపై కేసు నమోదయ్యింది. తనని ఓ రూంలోకి తీసుకెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ఇష్టం వచ్చినట్లు కొట్టారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్లితే... గత నెల 28న అసెంబ్లీ సమావేశాలను వీక్షించేందుకు 35 ఏళ్ల పార్టీ మహిళా కార్యకర్త హాల్ దగ్గరికి వెళ్లింది. అయితే విజిటింగ్ పాస్ లేకపోవటంతో బయటే ఉండిపోయింది. ఇంతలో ముగ్గురు ఆమె చుట్టూ చేరారు. అసభ్యంగా తాకుతూ బూతు పదజాలం వాడారు. ఆపై గదిలోకి తీసుకెళ్లి కొడుతూ లైంగిక దాడికి యత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలు జర్నల్ సింగ్, అమానుతుల్లా ఖాన్, సోమ్‌నాథ్ భారతీలు కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారంట.

అమానుతుల్లా ఖాన్ తనను నేలపై పడదోసి పట్టుకుంటే జర్నల్ సింగ్ తన పొట్టపై పిడిగుద్దులు కురిపించాడని ఆరోపించింది. దాదాపు అరగంట పాటు వారి వికృత చర్య కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, బాధిత మహిళ ఫిర్యాదుతో తాజాగా ఆ ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఆప్మాత్రం దీని ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించింది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 15 మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారని, దీని వెనుక కేంద్రమే ఉందన్న విషయం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుందని సౌరభ్ భరద్వాజ్ అనే నేత తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP MLAs  Assault Case  Assembly Premises  

Other Articles