World Bank Registered Case against Amaravati

Amaravati land pooling world bank registers complaint

World Bank, World Bank Amaravati, Amaravati Case, World Bank Registered Amaravati Case, Amaravati Land Pooling, Land Pooling Forcibly Amaravati, World Bank Registered Case, World Bank Twist Andhra Pradesh Govt

The World Bank has informed government of Andhra Pradesh that it has registered a case based on the complaints on forceful land acquisition from farmers for the construction of capital city Amaravati.

నవ్యాంధ్ర రాజధాని.. షాక్ కొట్టిందిగా...

Posted: 07/06/2017 03:18 PM IST
Amaravati land pooling world bank registers complaint

ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన సాయం అందించటంలో ప్రపంచ బ్యాంకు ట్విస్ట్ ఇచ్చింది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారన్న రైతుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది.

ప్రపంచ బ్యాంకు ప్యానెల్ చైర్మన్ గోంజాలో కాస్ట్రో డె లా మటా తరపున ఓ నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 8, 2016 న ల్యాండ్ పూలింగ్‌ కు సంబంధించి మొదటి ఫిర్యాదు అందింది, కానీ అప్పటికే ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉండటంతో దానిని పక్కన పెట్టేసింది. తిరిగి మే 22, 2017న 22 ఎటాచ్ మెంట్లతో కూడిన మరో నివేదిక వరల్డ్ బ్యాంకు ప్యానెల్ కు అందింది. ఈసారి మీడియా కథనాలతోపాటు కోర్టు ఉత్తర్వులు కూడా దానికి జత చేశారు. మళ్లీ మే 27న రైతుల నుంచి మరో విజ్నప్తి అందింది.

తమ నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, బ్యాంకు ప్రమాణాలను కూడా ప్రభుత్వం తుంగలో తొక్కేస్తుందని రైతులు అందులో ఆరోపించారు. అంతేకాదు పర్యావరణానికి హానికారకంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. దీంతో నిధుల మంజూరును తాత్కాలికంగా నిలిపేస్తూ.. జూలై 13 లోపు తమ కమిటీని రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం 1,27, 505 మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, కేవలం 150 మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక హంగులతో 217 చ.కిమీ అమరావతి నిర్మాణానికి 300 మిలియన్ల సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఐబీఆర్డీ (ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్ స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్) ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇచ్చే నివేదిక కీలకం కావటంతో ప్రభుత్వం ఆచీ తూచీ వ్యవహారించాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 5న జరిగే ప్రపంచబ్యాంకు కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో అమరావతి రుణం మంజూరుపై తుది నిర్ణయం తీసుకోనుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  World Bank  Land Pooling  

Other Articles