khammam rape case main accused held టీనేజ్ యువతి అత్యాచార వీడియో స్వాధీనం

Khammam rape case main accused held

teen girl raped by lover, teen girl raped by lover and friends, khammam teen girl, 18-year-old girl, teen girl gang rape filmed, teen girl sexual assault, rape, gangrape, akhil, lover, friends, blue film, sex video, parents, Police, khammam, telangana, crime

A 18-year-old girl was allegedly gang-raped by her lover and his friends, who also filmed her sex video and compelled her to satisfy them once again after two days. she then informed about the incident to parents and then on to police.

టీనేజ్ యువతి అత్యాచార వీడియో స్వాధీనం

Posted: 07/06/2017 05:40 PM IST
Khammam rape case main accused held

తెలంగాణలో పెను కలకలం రేపిన గ్యాంగ్ రేప్ నిందితుడ్ని ఖమ్మం పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో అమయాకురాలైన యువతని వంచించి.. అవసరాలను తీర్చుకున్న తరువాత.. వదిలించుకునే క్రమంలో మారో దారుణానికి ఒడిగట్టి.. తన స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంలో ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదవుతున్న యువతిని ప్రేమిస్తున్నానంటూ స్థానికంగా వుండే అఖిల్ అనే యువకుడు వెంటపడేవాడు. యువతి సరేనని అంగీకరించింది. ఈ క్రమంలో యువతితో అవసరాలు తీర్చుకున్నాడు అఖిల్.

దీంతో తనను పెళ్లి చేసుకోవాలని యువతి అఖిల్ వెంటపడాల్సి వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని స్నేహితులతో పథకం రచించిన అఖిల్ తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటూ ఆమెను ఈ నెల 1న ఒక రూమ్ కి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. అంతే కాకుండా ఈ తతంగం మొత్తం వీడియోగా చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని హెచ్చరించారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లింది. అనంతరం 3వ తేదీన మళ్లీ రూమ్ కి వచ్చి కోరిక తీర్చాలని దారుణానికి పాల్పడిన నలుగురూ వేధింపులకు దిగారు.

దీంతో యువతి ధైర్యంగా తల్లిదండ్రులకు దారుణాన్ని వివరించింది. వారితో కలసి ఈ నెల 4న ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు కూడా చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ఖమ్మంలోని బస్ డిపో రోడ్డుకు చెందిన అఖిల్ మినహా కామేపల్లి మండలంలోని కెప్టెన్‌ బంజర గ్రామానికి చెందిన ఉదయ్‌, ఖమ్మం రూరల్‌ మండలం జలగంనగర్‌ కు చెందిన కార్తీక్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన రాధాకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులందరిపై అపహరణ, సామూహిక అత్యాచారం, పోక్సో చట్టాలపై కేసులు నమోదుచేసి, ఉదయ్, కార్తీక్, రాధాకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టుల విషయం తెలియడంతో అఖిల్ తిరుపతిలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. తిరుపతిలో ఉన్న అఖిల్ ను అరెస్టు చేసేందుకు వెళ్లడంతో... పోలీసులు వస్తే బంధువుల ఇంట్లో పరువు పోతుందని ఖమ్మం చేరాడు. విషయం తెలిసిన పోలీసులు అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని నుంచి గ్యాంగ్ రేప్ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  akhil  lover  friends  blue film  sex video  parents  Police  khammam  telangana  crime  

Other Articles