set back to ysrcp mla, fire brand roja in SC సుప్రీంకోర్టులో వైసీపీ ఫైర్ బ్రాండ్ కు చుక్కెదురు.

Set back to ysrcp mla fire brand roja in supreme court

andhra pradesh assembly, rk roja suspension, ycp mla roja suspension case, nagari mla roja suspension case, call money case, tdp call money case, call money chandrababu roja, ysrcp mla roja, suspension, supreme court, high court, policits

set back to ysrcp mla, fire brand roja in supreme court, as the apex court says her to approach high court in her assembly suspension case.

సుప్రీంకోర్టులో వైసీపీ ఫైర్ బ్రాండ్ కు ఎదురుదెబ్బ

Posted: 07/06/2017 03:01 PM IST
Set back to ysrcp mla fire brand roja in supreme court

వైఎస్పార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు దేశ సర్వోన్నత న్యాయస్థాం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి అమెను అకారణంగా సస్పెండ్ చేశారన్న విషయమై అమె దాఖలు చేసిన పిటీషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసు వ్యవహారం హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టులోనే ఈ కేసు అంశాన్ని తేల్చుకోవాలని రోజా తరఫు న్యాయవాదులకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

అయితే పేదల రక్తమాంసాలను వడ్డీ రూపంలో పిండి పిప్పి చేస్తున్న అంశం కాల్ మనీ.. కాల్ మనీలో పేదింటి మహిళలను డబ్బును రుణంగా ఇచ్చిన పెద్దలు వారి కామవాంఛ తీర్చుకునేందుకు కూడా పూనుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. స్వయంగా బాధితులే తాము కాల్ మనీ కేసులో ఎలా ఇబ్బందులకు గురైయ్యమన్న విషయాలను నేరుగా మీడియా ఎదుటే అమ అవేదనను చెప్పుకున్నారు. దీంతో ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని వైసీపీ డిమాండ్ చేసిన నేపథ్యంలో అధికార టీడీపీ అడ్డుకుంది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

అయితే ఈ వాయిదా సమయంలో ప్రభుత్వ అధినేత చంద్రబాబును కాల్ మనీ చంద్రబాబు అని, సీఎం అంటే కాల్ మనీ అని రోజా అన్నారని అధికారపక్షం అమెను 2015 డిసెంబర్ లో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ అంశమై రోజా ఇప్పటికే క్షమాపణ చెప్పారని, లేఖ కూడా స్పీకర్ కోడల శివప్రసాద్ కు పంపామని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లేఖ అందలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి చెప్పారు. దీంతో ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా? అని రోజా న్యాయవాదులను సుప్రీంకోర్టు అడగగా.. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి న్యాయస్థానం సమక్షంలోనే లేఖ అందజేశారు. ఈ లేఖను సంబధిత శాఖలు, అధికారులకు పంపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టులో కేసు ముగిసిన తర్వాత మాత్రమే తాము విచారణకు స్వీకరిస్తామని మరోసారి స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp mla roja  suspension  supreme court  high court  policits  

Other Articles