Jammu Minister Serious Warn to Lawmaker

Kashmir deputy speaker angry on leaders clash

Jammu And Kashmir, Minister Imran Ansar, NC Leader Devender Rana, Ansari Rana Brawl, Jammu GST Implementation, Jammu GST Chaos, Jammu Deputy Speaker, Nazir Ahmad Gurezi Law Makers Clash, People Strip and Hit Leaders, Minister Warn Opposition MLA, Minister Threat MLA in Assembly

Jammu And Kashmir Minister Imran Ansari Tells Lawmaker Devender Rana In Assembly 'I Can Lynch You Here'. After Deputy Speaker Nazir Ahmad Gurezi hit out at both Stop attacking each other. People might strip you when you go out. This is nonsense. Stop it!".

గుడ్డలూడదీసి మరీ కొడతారు.. జాగ్రత్త!

Posted: 07/05/2017 09:15 AM IST
Kashmir deputy speaker angry on leaders clash

కుర్చీలు విసురుకోవటం, బూతుపురాణాలు బహుశా మన అసెంబ్లీలలో దర్శనమిచ్చినట్లు వేరే చోట ఇవ్వటం కష్టమేమో. చట్టసభలకు, చట్టాలకు గౌరవం ఇవ్వలేని వాళ్లు.. అందులో ఉండే తోటి ప్రతినిధులకు ఇస్తారనుకోవటం ముమ్మాటికీ పొరపాటే. కశ్మీర్ అసెంబ్లీలో సాక్షాత్తూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. స్పీకర్ సాక్షిగా ప్రతిపక్ష నేతను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ మంత్రి.

దేశం మొత్తం జూలై 1 నుంచి జీఎస్టీ అమలు అవుతున్న విషయం తెలిసిందే. అయితే జమ్ముకశ్మీర్ లో మాత్రం అది అమలు కావటం లేదు. దీంతో జీఎస్టీ అమలుపై బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం అవుతుండటంతో చట్టానికి సవరణ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

చర్చ జరుగుతున్న క్రమంలో సహనం కోల్పోయిన ఐటీ మంత్రి ఇమ్రాన్‌ అన్సారీ, ప్రతిపక్ష నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు దేవేందర్‌ రాణా నుద్దేశించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై రాణా ప్రతిస్పందనగా తానేమీ పన్నులు ఎగ్గొట్టలేదని మంత్రిని ఎత్తిపొడిచారు. అంతే, ఇమ్రాన్ మరింత కోపోద్రిక్తుడై... ‘‘నిన్ను ఇక్కడే చంపేయగలను. నీ దొంగ వ్యాపారాలన్నీ నాకు తెలుసు. నీకన్నా పెద్ద దొంగ ఎవడూ లేడు. మోబిల్‌ ఆయిల్‌ అమ్ముకుంటూ బిజినెస్‌ ప్రారంభించావు. ఈ సంపదంతా ఎలా పోగేసుకున్నావ్‌?’’ అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. దీంతో మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ సభలో కాసేపు అలజడి రేగింది.

ఇక ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నజీర్ అహ్మద్ గురేజీ ఇరు ప్రతినిధులపై మండిపడ్డాడు. ‘‘ప్రజా ధనాన్ని, చట్ట సభ కాలాన్ని వృథా చేస్తున్నారు, జనాలు మిమల్ని గమనిస్తున్నారు. బయట కనిపిస్తే మీ గుడ్డలూదీసి కొడతారు. తిట్టకోవటం ఆపేయండి..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu Kashmir  GST Debate  Lawmakers Fight  

Other Articles