Roller Coaster Ride Terrific Experience in England

Roller coaster suddenly stop in middle air

Roller Coaster Ride, Roller Coaster Ride Mishap, Roller Coaster Ride Stop, Roller Coaster Stop Middle, Roller Coaster Dangerous, Roller Coaster Ride Terrific Video, Roller Coaster Ride Horrific Experience, Roller Coaster Ride Funny Video, Mile Oak Roller Coaster Video, Facebook Crazy Videos

A roller coaster suddenly stopped mid-ride, leaving people dangling upside down at an amusement park in Mile Oak, England. A 20-second video captures the ride's stranded passengers briefly waving their arms about, perhaps in an attempt to catch someone's attention, as they wait to be rescued. Luckily, no one was reported hurt during the scary incident.

ITEMVIDEOS:గాల్లో ప్రాణాలు.. భయానక దృశ్యం

Posted: 07/05/2017 10:26 AM IST
Roller coaster suddenly stop in middle air

ప్రాణాలను సైతం పణంగా పెట్టి సరదా కోసం సాహసాలు చేసే మనుషులు ఉంటారు. అయితే అందులోని భయాన్ని పక్కన పెట్టి, కేవలం థ్రిల్ ను మాత్రమే వాళ్లు ఆస్వాదిస్తుంటారు. మనకు తెలిసో తెలీకో మన లైఫ్ లో కూడా అలాంటి అనుభవాన్ని ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసి ఉంటాం. సరదాగా ఎగ్జిబిషన్ లకు, అమ్యూజింగ్ పార్క్ లకో వెళ్లినప్పుడు అక్కడ రోలర్ కోస్టర్ పై ప్రయాణం చేయటం అలాంటిదే. భయమున్నప్పటికీ అది తల్లకిందులైనప్పుడు భయంతో కేకలు ఒకరకమైన క్రేజీ ఫీటే.

కానీ, ఇంగ్లాండ్ లో ని మైల్ ఓక్ ప్రాంతంలో అది భయానక అనుభవాన్ని మిగిల్చింది. డ్రేటాన్‌ మానర్‌ థీమ్‌ పార్క్‌ లో జీ- ఫోర్స్‌ రోలర్‌ కోస్టర్‌ సందర్శకులను ఎక్కించుకుని పరుగులు తీస్తుంది. అయితే, మార్గమధ్యంలో ఏ అవాంతరం వచ్చిందో ఏమో కానీ అందులోని వారంతా తల్లకిందులుగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. సాధారణంగా అది వేగంగా ప్రయాణిస్తూ క్షణకాలం పాటు తల్లకిందులైతేనే అందులోని వారి నుంచి భయంతో కూడిన అరుపులు వినిపిస్తాయి. అలాంటిది తల్లకిందులుగా ఆగిపోతే ఎలా ఉంటుంది?

 

అంతే ఒక్కసారిగా అందులోని వారంతా ప్రాణభయంతో కేకలు వేయడం ప్రారంభించారు. 20 సెకండ్ల పాటు అది అలాగే ఆగిపోగా, చేతులూపుతూ తమను రక్షించాలని కిందనున్నవారిని కోరారు. దీంతో పార్క్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని జాగ్రత్తగా కిందికి దించారు. ఇలాంటివి కంట పడితే ఎవరైనా ఊరుకుంటారా? ఓ వ్యక్తి ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది అలా వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roller Coaster Ride  England  Horrific Video  

Other Articles