Search Operation Completed for Muthoot Finance Robbers

Dacoits target muthoot finance again in hyderabad

Muthoot Finance Corporation , Muthoot Finance Hyderabad, Muthoot Finance Robbery Failed, Rajendranagar Happy Homes, Happy Homes Search Operation, Muthoot Finance centre, Telangana State police OCTOPUS

Operation on to flush out armed robbers who targeted Muthoot Finance Corporation Mailardevpally Branch. Commandos of the anti-terrorist squad of Telangana State police -OCTOPUS- are carrying out a major ‘combing operation’ inside Happy Homes residential complex at Rajendranagar here following a suspicion that at least seven armed suspects, who earlier made a vain bid to rob.

సెర్చ్ ఆపరేషన్.. అర్థరాత్రి హైడ్రామా!

Posted: 07/05/2017 08:32 AM IST
Dacoits target muthoot finance again in hyderabad

నగరం నిద్ర పోతున్న వేళ రాజేంద్రనగర్ లో పెద్ద హైడ్రామానే నడిచింది. తెలంగాణ 'ఆక్టోపస్' పోలీస్ దళాలు 'హ్యాపీ హోంస్' అపార్ట్ మెంట్స్ లో కదంతొక్కాయి. మంగళవారం మైలార్ దేవ్ పల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి యత్నం జరిగిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ అలారం మోగించటంతో వారు పారిపోయారు. అయితే ఆ దుండగులు దోపిడీలో వాడిన కారు పార్క్ చేసినట్టు సీసీ కెమెరా విజువల్స్ లో బయటపడింది. దీంతో కారు గురించిన సమాచారం సెక్యూరిటీ గార్డు పోలీసులకు అందించాడు.

గుజరాత్ రిజిస్ట్రేషన్ తో ఉందని, నెంబర్ ప్లేట్ పగులగొట్టి ఉందని సమాచారం ఇచ్చాడు. అంతే కాకుండా, కారులో మారణాయుధాలు కూడా ఉన్నట్టు చెప్పాడు. దీంతో సీసీ కెమెరాను మరింత క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలతో రంగంలోకి దిగారు. రాత్రివేళ హ్యాపీ హోమ్స్‌ ను చుట్టుముట్టగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇళ్లల్లోని వారిని ఖాళీ చేయించి మరీ జల్లెడపట్టారు. హ్యాపీ హోమ్స్ లో ఉన్న 9 బ్లాకుల్లో దాదాపు 500 ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్ మెంట్లన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపేసి అంగుళం అంగుళం తనిఖీలు చేశారు.

 

మరోవైపు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేసిన పోలీసులకు అవి పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 వరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనంలో వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతుండగా, పోలీసులు మాత్రం తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని ప్రకటించటం విశేషం. కొంత కాలం క్రితం గుజరాత్ నుంచి వలస వచ్చిన కొందరు ఈ అపార్ట్ మెంట్ లో స్థిరపడినట్లు పలువురు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muthoot Finance  Hyderabad  Robbery Plan  Search Operation  

Other Articles