సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ డ్రగ్ మాఫియాలో షాకింగ్ విషయాలే వెలుగు చూస్తున్నాయి. స్కూల్ విద్యార్థుల దగ్గరి నుంచి కంపెనీల సీఈవోల దాకా ప్రధాన నిందితుడు కెల్విన్ లిస్ట్ లో ఉండటం కలకలం రేపుతోంది. వీరే కాదు టాలీవుడ్ కు చెందిన నలుగురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు కూడా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఇక నేడు నలుగురు ఎంఎన్ సీ ఉద్యోగులను అరెస్ట్ చేయటంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది.
వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో 1200 మందికి పైగా విద్యార్థుల పేర్లు ఉన్నాయని ఎక్సైజ్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాకు తెలిపారు. వీరంతా 200కు పైగా వాట్స్ యాప్, టెలిగ్రాం యాప్ లను నిర్వహిస్తూ, మాట్లాడుకుంటున్నట్టు గుర్తించామని ఆయన తెలిపాడు. అయితే విద్యార్థుల పేర్లను బయటపెట్టాలన్న ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశాడు. వారి భవిష్యత్తు దృష్ట్యా, కనీసం విచారణకు కూడా పిలువబోమని, కానీ, సమాచారాన్ని సదరు పాఠశాలల ప్రిన్సిపాల్స్ కు మాత్రమే పంపామని తెలిపాడు.
పాఠశాలల యాజమాన్యాలే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయించాలని, విద్యార్థులు కూడా ఇంకెవరైనా డ్రగ్స్ సరఫరా చేసే ముఠా వివరాలు ఉంటే తమకు సమాచారాన్ని అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది. పిల్లలు ఏ చిన్న పని చేసినా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, ఇప్పటి నుంచైనా అప్రమత్తంగా ఉండాలని ఆయన సలహా ఇచ్చాడు.
డబ్బుకు బదులు న్యూడ్ ఫోటోలు...
డ్రగ్స్ మాఫియా కేసులో విచారణ కోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిడెంట్ శ్రీనివాసరావు, మరో అధికారితో కలిసి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభించిన ఆయన పలు ఆసక్తిర విషయాలనే వెల్లడించాడు. కెనడా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా ఇక్కడి స్టూడెంట్స్ ను, ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ల అమ్మాయిలు, టెక్కీ యువతులనే టార్గెట్ చేసినట్లు చెబుతున్నాడు.
ఇంట్లో వివిధ కారణాలు చెప్పి డబ్బులు తీసుకుంటున్న విద్యార్థులు మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్నారని ఆయన వెల్లడించాడు. డబ్బులు ఇవ్వలేని యువతులు మాత్రం వాళ్ల న్యూడ్ ఫోటోలను కెల్విన్ ను పంపి, వాటిని అమ్మి ఆ డబ్బు తీసుకోవాలని కోరేవారంట. అలా వాళ్ల ఫోటోలను అశ్లీల సైట్లకు అమ్మి కూడా నిందితుడు డబ్బు సంపాదించేవాడని తెలుస్తోంది. ఇలా చాలా మంది విద్యార్థినులు డ్రగ్ మత్తులో తమకు తెలీకుండానే పెద్ద రొంపిలోకే దిగినట్లు తేలిందని సిట్ అధికారి వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more