will never reveal students names involved in drug racket: police ఆ విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడకూడదు..

Will never reveal students names involved in drug racket police

mohammed abdul wahed, mohammed abdul quddus, Chicago, Chandrayangutta, calvin mascrenhas, Akun Sabharwal, drugs racket, hyderabad, special investigation team, excise task force drugs racket, telenagana crime

The excise wing of task force had arrested 4 members from various parts of the city today who were involved in drugs racket case. WhatsApp messages on mobiles seized from peddlers give a peek into the murky world of school-going addicts.

ఆ విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడకూడదు..

Posted: 07/04/2017 12:20 PM IST
Will never reveal students names involved in drug racket police

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఇవాళ మరో నలుగురిని అరెస్టు చేశామని, దీంతో ఇప్పటివరకూ మొత్తం ఏడుగురు అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి అరెస్టులు జరిగాయని తెలిపారు. అయితే ఇవాళ అరెస్టైయిన నిందితులు అందరూ సాప్ట్ వేర్ ఉద్యోగులేనని చెప్పారు. ఇప్పటివరకు 100 ఎల్ ఎస్ డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

కాగా డ్రగ్స్ మాఫియా అమాయక స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేసిందన్న విషయం తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో 1200 మందికి పైగా విద్యార్థుల పేర్లు ఉన్నాయని తెలిపారు. అయితే విద్యార్థులు పేర్లను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయటపెట్టరని చెప్పిన ఆయన.. డ్రగ్స్ రాకెట్ లో చిక్కుకున్న విద్యార్థులు అందోళన చెంది ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని విన్నవించారు. అయితే డ్రగ్స్ మాఫియాలో చిక్కుకున్న విద్యార్థుల పేర్లను సంబంధిత పాఠశాలల్లో ప్రిన్సిపాల్ లకు అందజేశామని అన్నారు.

వీరిలో ఒకే పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు వున్నట్లు కూడా చెప్పారు. వీరంతా 200కు పైగా వాట్స్ యాప్, టెలిగ్రాం యాప్ లను నిర్వహిస్తూ, మాట్లాడుకుంటున్నట్టు గుర్తించామన్నారు. వారి భవిష్యత్తు దృష్ట్యా, కనీసం విచారణకు కూడా పిలువబోమని తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయించే ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థుల్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని, ఇంకా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి వివరాలు విద్యార్థుల వద్ద ఉంటే వారు తమకు సమాచారాన్ని అందిస్తే, గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles