Only AP Excise Minister Knows Beer Value

Ap excise minister about beer consumption

Andhra Pradesh, Excise Minister, Excise Minister Jawahar, Minister KS Jawahar, Minister Beer Value, AP State Liquor Beer, Beer State Drink, AP New Liquor Policy, Minister KS Jawahar Controversial Comments,AP Minister Beer Class, Minister Jawahar Beer Value, AP Minister Beer Comments

Andhra Pradesh Excise Minister KS Jawahar Sensational Comments On Liquor. Beer healthier than other liquors. The state cabinet also decided to denotify portions of highways passing through cities as urban or major district roads, removing them from the ambit of the Supreme Court guidelines.

మన మంత్రి బీర్ లెక్కలు చూశారా?

Posted: 07/04/2017 11:19 AM IST
Ap excise minister about beer consumption

ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యంపాలసీపై నిరసన గళం వినిపిస్తున్న వేళ ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి శామూల్స్ జవహర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీరును ఓ ఆరోగ్యకరమైన పానీయం అంటూ పేర్కొనడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి పడుతున్నాయి. ప్రభుత్వం తరపున బీరును సంప్రదాయ హెల్త్ డ్రింక్ అనేలా ప్రచారం చేస్తామంటూ ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మిగతా పానీయాలతో పోలిస్తే బీరులో ఆల్కాహాల్ శాతం తక్కువ, పైగా ఆరోగ్యానికి మంచిది కూడా. అందుకే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని భావిస్తోందని తెలిపాడు.

అలాగని ఇది మంచి అలవాటని నేను చెప్పటం లేదు. ప్రజల అలవాటును మాన్పించటం సాధ్యం కానీ పని కాబట్టి, తక్కువ డోస్ ఆల్కాహాల్ తో మద్యం ను తయారు చేసేలా చర్యలు మాత్రం తీసుకోగలమని పేర్కొన్నాడు. అవసరమైతే ప్రభుత్వమే వాటిని తయారు చేసేందుకు ముందుకు వస్తుందని తెలిపాడు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి హైవేలపై మద్యం షాపులను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో దేవుళ్ల పేరు షాపులకు పెట్టకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించాడు.


 

మంత్రిపై ఫైర్...

ఇక మంత్రి మాటలపై వివిధ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైట్ బీర్ లో 5%, స్ట్రాంగ్ బీర్ లో 8% ఆల్కహాల్ ఉంటుందని, అటువంటప్పుడు అది ఎలా హెల్త్ డ్రింక్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు. బీరు వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, బెల్లీ ఫాట్ పెరుగుతుందని, బీర్ ఆరోగ్యకర పానీయం అని ఎవరు చెప్పారని వైద్యులు ప్రశ్నిస్తుండగా....అసలు బీర్ బాటిల్ పై ఆరోగ్యానికి హానికరం అని ఎందుకు ముద్రించి ఉంటుందోనన్న సంగతైనా మంత్రికి తెలుసా? అంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

మంత్రి తీరు చూస్తుంటే మద్యం ఆరోగ్యకరమేనన్న స్లోగన్ తో ముందుకెళ్తున్నాడా? రాష్ట్ర పానీయంగా బీరును ప్రకటించేయడు కదా అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. "పచ్చి నిజం చెప్పిన జవహర్ పై ఈ కోపమెందుకు?" అని ఓ యువకుడు ప్రశ్నించగా, "ఆయన రోజూ హెల్త్ డ్రింక్ తాగుతారేమో?" అని మరో వ్యక్తి, "ఇక బీరును మద్యం షాపుల్లో కాకుండా, సాధారణ కిరాణా దుకాణాల్లో కూడా అమ్మాల్సిందే" అని ఇంకొ యువకుడు కామెంట్ చేశాడు. బీరుపై ఉండే 'మద్యపానం హానికరం' హెచ్చరికను తొలగించాలని, అందుకు తగ్గ ఆదేశాలను ఎక్సైజ్ మంత్రిగా జవహరే జారీ చేయాలని మరో యువకుడు వ్యాఖ్యానించాడు. 

 

నాకు వాసనే పడదు...

తాను అసలు బీరు హెల్త్ డ్రింక్ అన్న వ్యాఖ్యలు చేయలేదని మంత్రి జవహార్ వివరణ ఇచ్చుకున్నాడు. బీరులో ఆల్కహాల్ శాతాన్ని తగ్గించి, హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తానని మాత్రమే చెప్పానని,  బీర్ తోపాటు , తాటి కల్లు, ఈత కల్లు లాంటి సహజ పానీయాలను కూడా ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అసలు తనకు మద్యం వాసనే పడదని, అలాంటప్పుడు తానెందుకు బీర్ ను ప్రమోట్ చేస్తానని వాపోయాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Excise Minister  KS Jawahar  Beer Comments  

Other Articles