Akbaruddin Owaisi attempt murder Case judgment pronounced అక్బరుద్దీన్ హత్యాయత్నం కేసులో తుది తీర్పు వెల్లడి

Court pronounced judgment in akbaruddin owaisi attempt murder case

akbaruddin owaisi, mim mla, nampally court, Nampally Criminal Court, Metropolitan Sessions Judge, justice T. Srinivas Rao, murder attempt case, land dispute, saleem bin, abdullah, avadh, hassan bin omer, pahilwan, telangana police

Nampally Criminal Court pronounced judgment in Akbaruddin Owaisi attempt murder Case and held 4 accused as guilty. In view of judgement Police made elaborate security arrangements in the premises of criminal court.

అక్బరుద్దీన్ హత్యాయత్నం కేసులో తుది తీర్పు వెల్లడి

Posted: 06/29/2017 12:57 PM IST
Court pronounced judgment in akbaruddin owaisi attempt murder case

ఎంఐఎం పార్టీ శాసనసభాఫక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్న కేసులో నలుగురు నిందితులను నాంపల్లి క్రిమినల్ కోర్టు దోషులగా నిర్ధారించింది. 2011 ఏఫ్రిల్ 30న చంద్రాయణ గుట్ట కేశవగిరిలోని బార్కస్-బాలాపూర్ రోడ్డులో అభివృద్ది కార్యక్రమాల కోసం వచ్చిన ఎమ్మెల్యే అక్భరుద్దీన్ పై మాటు వేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ పహిల్వాన్ ను న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసింది. అతనితో పాటు ఈ కేసులో నిందితులుగా వున్న మరో 10 మందిని కూడా నిర్ధోషులుగా పరిగణించింది.

ఈ కేసులో మొత్తంగా నలుగురిని హసన్ బిన్ ఒమర్ (ఏ2), అబ్దుల్లా (ఏ3), వాహిద్ ‌(ఏ5), వహ్లాన్ ‌(ఏ12)లను దోషులుగా నిర్ధారించింది. ఈ నలుగురు దోషులకు పదేళ్ల పాటు జైలు శిక్షను విధించింది. దీంతో పాటు నలుగురు నిందితులకు పది వేల రూపాయల జరమానా కూడా విధించింది. ఈ కేసులో మొత్తం 14 మందిపై కేసు నమోదు చేయగా నలుగురిని మాత్రమే దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. నాంపల్లిలోని 7వ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులొ న్యాయమూర్తి జస్టిస్ టి.శ్రీనివాస రావు ఇవాళ ఈ కేసు తుది తీర్పును వెలువరించారు.

తుది తీర్పు నేపథ్యంలో న్యాయస్థానం వద్ద కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ ఘటనలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గన్ మెన్ తో పాటుగా గన్ మన్ జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు మరణించారు. దీంతో ఈ కేసులో మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చి దర్యాప్తు చేసిన సిసీసీఎస్ పోలీసులు వేగంగా దర్యాప్తును చేపట్టారు. వీరందరీపై న్యాయస్థానంలో అభియోగపత్రాలను సమర్పించారు. దీంతో విచారించిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెలువరించి.. దోషులకు పదివేల రూపాయల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akbaruddin owaisi  mim mla  pahilwan  nampally court  murder attempt case  telangana police  

Other Articles