Araku MP Kothapalli Geetha Caste Case wihtdrawan

Chandrababu involved in geetha and sandhyarani clash

Kothapalli Geetha, Kothapalli Geetha Caste Case, Kothapalli Geetha Case, Kothapalli Geetha Relief, Kothapalli Geetha Case Withdrawn, Kothapalli Geetha Gummadi Sandhyarani, Sandhya Geetha Chandrababu, Candrababu Control Araku Politics, Kothapalli Geetha ST Case

AP MLC Gummadi Sandhya Rani wihtdrawan caste case againt Araku MP Kothapalli Geetha, Chandrababu behind the scene YSRCP alleges.

హే... చంద్రబాబు చెబితే వింటున్నారా?

Posted: 06/29/2017 12:58 PM IST
Chandrababu involved in geetha and sandhyarani clash

ఫిరాయింపులతో పార్టీలోకి వచ్చిన వాళ్లకు, అప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లకు మధ్య నెలకొంటున్న తగదాలను పరిష్కరించే క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. కర్నూల్ రాజకీయాలను సర్దిపుచ్చటంలో విఫలమయిన బాబు ఏకపక్షం కావాల్సిన నంద్యాల ఉపఎన్నికను శిల్పను సాగనంపటంతో గట్టి పోటీగా మార్చేశాడు. అయితే ఇలాంటి సీన్లు ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదనుకోండి.

దేశంలోనే రెండో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా పేరున్న అరకులో కూడా కొంత కాలం క్రితం దాకా ఇదే సీన్ కనిపిస్తూ వస్తోంది. ఎలాంటి రాజకీయ బ్యాగ్రౌండ్ లేకుండా వైకాపా తరపున గెలిచిన కొత్తపల్లి గీత తర్వాత టీడీపీలోకి ఫిరాయించింది. అదే సమయంలో అక్కడ బలమైన నేతగా ఉన్న మరో మహిళా నేత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి, గీతతో ఎప్పటి నుంచో పడదనేది తెలిసిందే. పైగా తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో గీత పోటీ చేసిందని ఆరోపిస్తూ కేసు వేసింది కూడా సంధ్యనే.

Sandhya Kotthapalli Geetha

అయితే అధినేత చంద్రబాబు నాయుడు కల్పించుకోవటంతో కొత్తపల్లి గీత కుల వివాదం కేసు సరికొత్త మలుపు తిరిగింది. సంధ్యారాణి గీతపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంది. గీత తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుండటం, ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉండటంతో, కోర్టుల్లో పోరాటాలు ఎందుకని బాబు చేసిన సూచన మేరకే సంధ్యారాణి కేసును వెనక్కు తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కేసును చూపించే గీతను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారన్నది స్పష్టమైందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటూ గిరిజన సంఘాలను రంగంలోకి దించి కేసును కొనసాగించేలా చేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Kothapalli Geetha  Sandhya Rani  Caste Case  

Other Articles