simple steps to link Aadhaar with PAN linking రేపే తుది గడువు.. నిమిషంలో ప్యాన్ తో అధార్ లింకు

Simple steps to link aadhaar with pan linking

Aadhaar, PAN, Aadhaar-PAN linking, verify Aadhaar-PAN linking, Aadhaar-PAN linking procedure, Income Tax Department, Arun Jaitley

The government has made it mandatory for every taxpayer to link Aadhaar number with PAN card while e-filing for tax returns. Here's how to link Aadhaar with PAN and how to verify if both cards are linked.

నిమిషంలో ప్యాన్ తో అధార్ లింకు.. రేపే తుది గడువు

Posted: 06/29/2017 03:13 PM IST
Simple steps to link aadhaar with pan linking

ఆదాయ పన్ను శాఖ అమల్లోకి తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్‌ కార్డ్‌ నంబర్)తో ఆధార్ నంబ‌ర్‌ అనుసంధానం చేసుకోవడం తప్పనిసరిగా మారింది. గత రెండు నెలలుగా ఈ మేర ప్యాన్ కార్డుతో అధార్ ను లింక్ చేసుకోమ్మని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు అమలు కానున్న నేపథ్యంలో అదే రోజు (జూలై 1) నుంచి అనుసంధాన ప్రక్రియ కూడా అమల్లోకి రానుంది. జులై 1, 2017లోపు పాన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఆధార్ తో లింకు చేయాల్సిందేన‌ని ఆదాయ శాఖ స్పష్టంచేసింది.

తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆధార్ నెంబరుతో ప్యాన్ కార్డు లింకు చేయాలని స్పష్టమైన అదేశాలను వెలువరించిన నేపథ్యంలో ఇక ఇందుకు రేపు తుది గడువు కావడంతో.. అధార్ తో ప్యాన్ కార్డు లింకు చేయడమేలా అన్న అందోళన అందరిలోనూ నెలకోంది. అందుకనే ఈ ప్రక్రియను నిమిషంలోపు ఎలా పూర్తి చేయాలో తెలియజేస్తున్నాం. అయితే ప్యాన్ తో అధార్ ను లింకు చేయడంలో రెండు పద్దతులు వున్నాయి. ఒకటి అదాయ పన్ను వివరాలతో రిటర్న్స్ ఫైల్ చేసేవారకి కాగా, మరోకటి రిటర్న్స్ ఫైల్ చేయని అంటే వార్షికాదాయం మూడు లక్షల లోపు వున్నవారికని రెండు పద్దతులు వున్నాయి

కేంద్ర ప్రభుత్వ తాజా అదేశాలు.. వాటిని సమర్ధించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో.. దేశంలోని ప్యాన్ కార్డు పోందిన వారిలో ఇప్పటికే 2 కోట్ల 57 ల‌క్షల మంది త‌మ పాన్‌ను ఆధార్‌తో లింకు చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ లింకింగ్‌ ప్రక్రియ ఎలాగో ఒకసారి చూద్దాం.
 
ఇన్ క‌మ్ టాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేసే వారు.. రిజిస్టర్డ్ యూజ‌ర్లు అయితే

1) www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి.. రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియ‌ర్ అప్షన్ పై క్లిక్ చేయాలి
2) యూజ‌ర్ ఐడి, పాస్ వ‌ర్డ్ తోపాటు అక్కక డిస్‌ప్లే అయ్యే క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేయాలి. దీంతో ఆధార్ తో పాన్ ను లింక్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది.  
3) పాన్ నెంబ‌ర్, ఆధార్ నెంబ‌ర్, ఆధార్ నెంబరులో వున్న విధంగా పేరు, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేయాలి.
లింకింగ్ ప్రక్రియ పూర్తయితే వెంటనే విజయవంతంగా అధార్ తో ప్యాన్ అనుసంధానమైన మెసేజ్ కనిపిస్తుంది..

ఇన్ క‌మ్ టాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేసే వారు.. రిజిస్టర్డ్ యూజ‌ర్లు కానివారైతే...

1) www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట‌ర్ యువ‌ర్ సెల్ఫ్ (New to e-filling Register yourself) అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి
2). మీ వివ‌రాలు ఎంట‌ర్ చేయండి.
3) మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి..  యూజ‌ర్ ఐడి, పాస్ వ‌ర్డ్ వ‌స్తాయి. త‌ర్వాత ఆ వివ‌రాల‌తో లాగిన్ అయి.. పైన రిజిస్టర్డ్ యూజర్ ద్వారా లాగిన్ అయ్యి ఆధార్, పాన్ ను లింక్ చేయాలి.
 
ఇన్ క‌మ్ టాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌ని వారు
 
1) www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో కి వెళ్లాలి.  
2) ఆధార్‌ లింకింగ్‌  విత్‌ పాన్‌  మేడ్‌సింపుల్‌..క్లిక్ హియ‌ర్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.. త‌ర్వాత త్రి కాలమ్స్‌తో ఉన్న టేబుల్‌ ఓపెన్‌ అవుతుంది.
3) నిర్దేశిత కాలమ్‌ లో పాన్ నెంబ‌ర్, ఆధార్ నెంబ‌ర్,  పేరు (ఆధార్ లో ఉన్న విధంగా), క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేయాలి.
లికింగ్ ప్రక్రియ పూర్తవ్వగానే స‌క్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles