Election for Vice-President to be held on August 5 ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..

Election for next vice president on august 5 result same day

Zaidi, election schedule, election commission, Hamid Ansari, Nasim Zaidi, vice presidential elections, Vice presidential, shamsher sharif, Rajya Sabha, Election Commission

The election for the post of Vice President (VP) will be held on August 5 and the results will be announced on the same day, the Election Commission (EC) said on Thursday.

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..

Posted: 06/29/2017 11:58 AM IST
Election for next vice president on august 5 result same day

రాష్ట్రపతి ఎన్నికలకు కోసం ఏర్పాట్లను చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం మరోవైపు ఇవాళ ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీ కాలం ముగియనున్న తరుణంలో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం చేసింది. కాగా, ఈ ఎన్నికల కోసం జూలై 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల కమీషనర్ నజీమ్ జైదీ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఆగస్ట్‌ 5వ తేదీన నిర్వహించనుండగా, అదే రోజున ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

కాగా నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, నామినేషన్లు దాఖలుకు 18వ తేదీతో గడువు ముగియనుందని సీఈసీ తెలిపారు. జూలై 19న స్రూటినీ జరగనుండగా, 21న . ఉపసంహరణకు చివరి తేదిగా వెల్లడించారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక పెన్నులను అందిస్తామని వాటితోనే వారు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోనున్నారని తెలిపింది. ఇక రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.

అయితే మొత్తంగా 790 మంది సభ్యులున్న ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఉభయ సభల్లోనూ పలు స్థానాలు ఖాళీలు వున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో దేశంలోని ఏ రాజకీయ పార్టీలకు కూడా విఫ్ జారీ చేసే అధికారం లేదని కేంద్ర ఎన్నికల కమీషనర్ జైదీ వెల్లడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ షుంషేర్ షరీఫ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన హమీద్ అన్సారీ పదవీకాలం అగస్టు 10తో పూర్తికానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles